- Telugu News Photo Gallery Cricket photos Here is the List of IPL Cricketer who have scored most 50 plus knocks
IPL 2023: ధనాధన్ లీగ్‌లో టాప్ 5 ‘హాఫ్ సెంచరీ’ ఆటగాళ్లు.. ఐపీఎల్ మైదానంలోకి దిగారంటే పరుగుల వర్షమే..
ఆదివారం జరిగిన ముంబై, ఆర్‌సీబీ మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 82 పరుగులు చేసి.. మొత్తంగా 50కి పైగా పరుగులు 50 సార్లు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా హాఫ్ సంచరీలు చేసిన ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 04, 2023 | 8:48 AM

ఆదివారం బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో కింగ్ కోహ్లీ అజేయంగా చేసిన 82 పరుగులు చాలా కీలకమని చెప్పుకోవాలి.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ లిస్టులో కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 216 ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. మొత్తంగా 6,706 పరుగులు రాబట్టాడు. విశేషమేమిటంటే.. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్‌లో ఆడిన ప్రతి మ్యాచ్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడాడు.

ఈ లిస్టులో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. మొత్తం 5,937 పరుగులు చేసిన వార్నర్ మామ ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఇందుకోసం వార్నర్ 163 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.

తన ఐపీఎల్ కెరీర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున మాత్రమే ఆడిన కోహ్లీ తాజాగా అర్థశతకాల అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

శిఖర్ ధావన్ ఇప్పటివరకు 47 సార్లు ఈ ఫీచ్ అందుకున్నాడు.

ఈ లిస్టులో మిస్టర్ 360 ఏబీ డీ విల్లియర్స్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ క్రికెట్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఏబీ 43 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు.

ఇక టాప్ 5లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఐపీఎల్ తొలి 3 సీజన్లలో డెక్కన్ చార్జర్స్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తోనే ఉన్న హిట్ మ్యాన్ 41 సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు.




