- Telugu News Sports News Cricket news Ipl 2023 rcb vs mi mumbai indians skipper rohit sharma as a lowest strike rate as a ipl captain s list
IPL 2023: కోహ్లీ దెబ్బకు చెత్త రికార్డుల్లో చేరిన హిట్‌మ్యాన్.. ఐపీఎల్‌లో తొలి సారథిగా.. అదేంటంటే?
Rohit Sharma: IPL 2023 ఐదో మ్యాచ్‌లో RCB ఏకపక్ష మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట అవాంఛిత రికార్డు నమోదైంది.
Updated on: Apr 03, 2023 | 3:40 PM

RCB vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఐదవ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ జట్టు 171 పరుగులు చేసింది. అదే సమయంలో బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 172 పరుగుల విజయ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఓ ఇబ్బందికర రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో స్ట్రైక్ రేట్ అత్యంత దారుణంగా ఉన్న తొలి కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డాడు. ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొనేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో 10 బంతుల్లో కేవలం 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో రోహిత్ స్ట్రైక్ రేట్ 10గా నిలిచింది. 10 బంతులు ఆడిన తర్వాత ఐపీఎల్‌లో ఏ జట్టు కెప్టెన్‌కైనా ఇదే చెత్త స్ట్రైక్ రేట్ కావడం గమనార్హం.

ఇది మాత్రమే కాదు, రోహిత్ శర్మ 2022 సంవత్సరంలో కూడా రెండు మ్యాచ్‌లలో ఇదే విధమైన ప్రదర్శన చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 15.38కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 25గా నిలిచింది.

ఐపీఎల్ 2022లో కూడా ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభమైంది. గతేడాది బ్రబౌర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో IPL 2023 లో కూడా ముంబై ఓటమితో ప్రారంభమైంది.

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 5,880 పరుగులతో ఈ లిస్టు నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక రోహింత్ ఈ పరుగుల కోసం మొత్తం 223 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.





























