Watch Video: బాబోయ్ కుక్కలు.. బిడ్డతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెంటపడిన వీధికుక్కలు.. చివరికి..
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకే బెంబేలెత్తుతున్నారు. వీధి కుక్కల దాడుల్లో ఇప్పటికే పలువురు మృతిచెందగా.. అనేకమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకే బెంబేలెత్తుతున్నారు. వీధి కుక్కల దాడుల్లో ఇప్పటికే పలువురు మృతిచెందగా.. అనేకమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వీధి కుక్కల బారి నుంచి తప్పించుకుంటూ.. స్కూటీపై వెళ్తున్న ఓ బాలుడు సహా.. ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఒడిశాలోని బెర్హంపూర్ నగరంలో వీధికుక్కలు కరుస్తాయనే భయంతో ఓ మహిళ తన స్కూటర్‌ను.. రోడ్డుపక్కనున్న కారుకు ఢీకొట్టింది.
మీడియా కథనాల ప్రకారం.. ఒడిశాలోని బెర్హంపూర్ నగరంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును మహిళ తన స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 17 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌లో వీధికుక్కలు.. బైక్ పై వెళ్తున్న ముగ్గురిని వీధి కుక్కలు వెంబడించాయి. అకస్మాత్తుగా ఐదు కుక్కలు వెంబడించడంతో ఆ మహిళ.. భయంతో బైక్ వేగాన్ని పెంచింది. అయితే.. ముందు పార్క్ చేసి ఉన్న కారును చూసుకోకుండా దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడితోపాటు.. మహిళలలకు స్వల్పగాయాలయ్యాయి.
వీడియో చూడండి..
Caught on Camera | Scared of being bitten by stray dogs, a woman rammed her scooty into a car parked on the side of the road in Berhampur city in Odisha. Both women and the child sustained multiple injuries in the incident. pic.twitter.com/F5h8wtCFHy
— Press Trust of India (@PTI_News) April 3, 2023
నివేదికల ప్రకారం, ఈ సంఘటనలో మహిళ, ఆమె బిడ్డకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..