- Telugu News Photo Gallery Superfoods for male fertility: best foods for male fertility sperm count low testosterone level relationship tips in Telugu
Male Fertility: టెన్షన్ వద్దు మామ.. పురుషుల్లో స్టామినాను అమాంతం పెంచే టాప్ 5 ఆహార పదార్థాలివే..
ఆరోగ్యకరమైన లైంగిక జీవితం పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక, సంతాన సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి.. ముఖ్యంగా లైంగిక పనితీరు, సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి కొన్ని ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Updated on: Apr 02, 2023 | 1:30 PM

ఆరోగ్యకరమైన లైంగిక జీవితం పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక, సంతాన సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి తరుణంలో వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి.. ముఖ్యంగా లైంగిక పనితీరు, సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి కొన్ని ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారాలు స్టామినాను పెంచడంతోపాటు లిబిడోను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పురుషుల్లో బలాన్ని, సంతానోత్పత్తిని పెంచే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

పండ్లు: ఎక్కువగా పండ్లు తీసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య 14% తగ్గుతుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. దీనికి కారణం కొన్ని పండ్లలో ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండటమే. బెర్రీలు, ద్రాక్షలు, యాపిల్స్, సిట్రస్ పండ్లు వంటి పండ్లలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ అంగస్తంభనను మెరుగుపరుస్తుంది. సంతానోత్పత్తి సమస్యను దూరం చేస్తుంది. ఎందుకంటే ఇది సిట్రులిన్ శరీరంలోని అర్జినైన్ వంటి అమైనో ఆమ్లాలను విడుదల చేస్తుంది.

నట్స్: బాదం, వాల్నట్, జీడిపప్పు, వేరుశెనగ, హాజెల్ నట్స్ వంటి అన్ని రకాల గింజలలో జింక్, అర్జినైన్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నందున వాల్‌నట్‌లు డ్రై ఫ్రూట్స్‌లో ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. అదనంగా, వాల్‌నట్‌లు స్పెర్మ్ నాణ్యతను, పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.

కాఫీ: కప్పు కాఫీలో ఉండే కెఫిన్ పడకగదిలో మంచి అనుభూతిని కలిగిస్తుంది. కానీ దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల మీరు చికాకు పడవచ్చు. లైంగిక పనితీరు కూడా దెబ్బతింటుంది. కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఇది అలసట, పొడిబారడం. ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, ఒక రోజులో ఒకటి నుంచి మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీని తీసుకోవద్దు.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. కానీ అదే సమయంలో ఇది లైంగిక స్టామినాను పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనోల్స్ రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి. ఇది పురుషులు అంగస్తంభన సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. అయితే, కోకోతో చేసిన డార్క్ చాక్లెట్ తినడం మంచిది.

మీట్: మాంసం అధిక అమైనో యాసిడ్ ప్రొఫైల్‌తోపాటు ప్రోటీన్-రిచ్ ఫుడ్. మాంసంలో జింక్, కార్నిటైన్, అర్జినైన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అంగస్తంభన సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుందని అనేక పరిశోధనలలో నిరూపితమైంది.





























