Viral: ఉర్ఫీ జావేద్ ఎవరో నాకు తెలియదు.. ఎప్పటినుంచో ఇలాగే ప్రయాణిస్తున్నాను: ఢిల్లీ మెట్రో గర్ల్..
సోషల్ మీడియలో ఫేమస్ అయ్యేందుకు కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. పబ్లిక్ ప్లేసా.. ప్రైవేట్ స్థలమా అనేది లేకుండా బరితెగిస్తున్నారు. సోషల్ మీడియలో ట్రెండ్ అవుతూ.. మెట్రో సంస్థకు తలొంపులు తెస్తున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రో అశ్లీలతకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆకతాయిల ఆగడాలు ఈమధ్య ఎక్కువై పోతున్నాయి.
సోషల్ మీడియలో ఫేమస్ అయ్యేందుకు కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. పబ్లిక్ ప్లేసా.. ప్రైవేట్ స్థలమా అనేది లేకుండా బరితెగిస్తున్నారు. సోషల్ మీడియలో ట్రెండ్ అవుతూ.. మెట్రో సంస్థకు తలొంపులు తెస్తున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రో అశ్లీలతకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆకతాయిల ఆగడాలు ఈమధ్య ఎక్కువై పోతున్నాయి. ఢిల్లీ మెట్రోలో అసాంఘిక కార్యక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పాపులర్టి కోసం మెట్రో పరువును బజారున పడేస్తున్న యూత్. ఢిల్లీ మెట్రోలో రికార్డయ్యే వైరల్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న సోయి లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. లేటెస్ట్‌గా ఓ యువతి ఢిల్లీ మెట్రోలో కేవలం మైక్రో మినీ స్కర్ట్‌తో ప్రత్యక్షమై మెట్రోలో ప్రయాణికులను షాక్ కు గురిచేసింది. ఆమె బికినీ డ్రస్ చూసిన వారందరూ అవాక్కయ్యారు. ఇదేం డ్రస్ బాబాయ్.. అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ క్రమంలోనే.. మెట్రోలో బికినీతో ప్రయాణించిన మహిళలను కొందరు సపోర్ట్ చేయగా, పలువురు ఉర్ఫి జావెద్ మాదిరిగా ప్రవర్తిస్తోందని.. ఇది కరెక్ట్ కాదంటూ ఖండిస్తున్నారు. ఫ్యాషన్‌తో ఫేమస్ కావాలని ప్రయత్నిస్తున్నారంటూ మరికొందరూ తప్పుబడుతున్నారు. ఇలాంటి వారి చేసే తప్పులతో ట్విటర్‌లో #DelhiMetro హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.. దీనిపై ఢిల్లీ మెట్రో బృందం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఆమెపై వస్తున్న రూమర్లపై ఆ అమ్మాయే స్వయంగా స్పందించింది.
వారిని పట్టించుకోను..
అయితే, ఆ అమ్మాయి పేరు రిథమ్ చననగా ఇండియా టుడే పేర్కొంది. ఆ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వస్త్రధారణ వెనుక ఉన్న కథ.. సమాజం తీరు గురించి మాట్లాడింది. “నేను ఏమి ధరించాలనుకుంటున్నానో అది నా స్వేచ్ఛ. నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో, పేరు తెచ్చుకోవడం కోసమో ఇలా చేయడం లేదు. ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో నేను పట్టించుకోను. నేను ఉర్ఫీ జావేద్ నుంచి ప్రేరణ పొందలేదు. ఇటీవలి వరకు ఆమె ఎవరో నాకు తెలియదు, ఒక స్నేహితుడు ఆమె ఫోటోను నాకు చూపించాడు. అయితే, ఆమె కథ తెలిసిన తర్వాత నేను ఆమె కోసం చూస్తున్నాను” అని చననా పేర్కొంది. చాలా నెలలుగా ఇలాగే ప్రయాణిస్తున్నానని.. దీనిపై ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన అమ్మాయి చెప్పింది.
ఢిల్లీ మెట్రో గర్ల్ వీడియో చూడండి..
What is wrong with #delhimetro ? #Girls How can you travel like this in #delhimetro ?#DelhiMetroDiaries #delhi #womenempowement #womensafety #delhipolice #CISF #feminism #feminist #feminists ●Lets see if @OfficialDMRC @DelhiPolice have the guts to ans these ques? pic.twitter.com/IsAabGPJi7
— YoursJaskier (@JaskierYours) April 2, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..