AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bone Health: బోలు ఎముకలకు ఈ ఆహారాలే పరిష్కారం.. తీసుకుంటే ఉక్కులాంటి బోన్స్ మీ సొంతం..

చాలా మంది చిన్న వయసులోనే కీళ్ల నోప్పులు, పేలవమైన ఎముకలతో బాధపడుతున్నారు. అందుకు వారు తీసుకునే ఆహారంలో పోషకాలు సరిపడా లేకపోవడమే కారణమని చెప్పుకోవాలి. అయితే తొలి దశలోనే ఈ సమస్యలను..

Bone Health: బోలు ఎముకలకు ఈ ఆహారాలే పరిష్కారం.. తీసుకుంటే ఉక్కులాంటి బోన్స్ మీ సొంతం..
Bone Health
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 03, 2023 | 2:11 PM

Share

ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న వయసులోనే కీళ్ల నోప్పులు, పేలవమైన ఎముకలతో బాధపడుతున్నారు. అందుకు వారు తీసుకునే ఆహారంలో పోషకాలు సరిపడా లేకపోవడమే కారణమని చెప్పుకోవాలి. అయితే తొలి దశలోనే ఈ సమస్యలను గుర్తించి సరైన ఆహారాలను తీసుకోకపోతే అవి మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా బలహీనమైన ఎముకలు లేదా బోలు ఎముకల వ్యాధిని నివారించేందుకు కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాలను తప్పక తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల దృఢమైన పోషకాలతో పాటు, వాటిలోని పోషకాలతో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో వారు సూచిస్తున్న ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం..

కాల్షియం అధిక మొత్తంలో ఉన్న ఆహారాలివే..

విత్తనాలు: చియా గింజలు, గసగసాలు, నువ్వులు, సెలెరీ వంటి విత్తనాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. అదనంగా ఇవి మీ ఆరోగ్యానికి కావలసిన ప్రోటీన్లు, కొవ్వు అమ్లాలను అందిస్తాయి. ముఖ్యంగా చియా గింజల్లో బోరాన్ అనే మినరల్ ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరచడంలో మీకు ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో ఉండే సహజమైన ఫాస్పరస్, మెగ్నీషియం మీ జీవక్రియలో కూడా ఉపకరిస్తాయి.

 బాదం: కాల్షియం, కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వంటి పలు పోషకాలు బాదంలో పుష్కలంగా ఉన్నాయి. అవి ఎముకల పునరుద్ధరణ, గుండె ఆరోగ్య నిర్వహణకు సహాయపడతాయి. ఒక కప్పు బాదం పప్పులో 385 mg కాల్షియం ఉంటుంది. ఇంకా బాదంలో ఉండే కొవ్వులు, కేలరీలు ఆరోగ్యానికి ప్రయోజనకరం.

ఇవి కూడా చదవండి

పెరుగు: పెరుగు అనేది మన సంప్రదాయ ఆహారం. నిజానికి పెరుగులోనే పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. 8-ఔన్సుల పెరుగు ప్రతి రోజు మీకు అవసరమైన కాల్షియం మొత్తంలో 42 శాతాన్ని అందిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

గుడ్లు: గుడ్లు విటమిన్ డిని మంచి స్థాయిలో కలిగి ఉన్నందున అవి ఎముకలను బలపరుస్తాయి. అయితే గుడ్డు సొనలు మాత్రమే విటమిన్ డిని కలిగి ఉంటాయి. ఇంకా ఇందులోని కాల్షియం కూడా మీ ఎముకల ఆరోగ్యానికి మంచిది. రోజూ క్రమం తప్పకుండా రోజూ కనీసం ఒక గుడ్డును అయినా తింటే చాలు, మీ ఆరోగ్యం మెరుగుపడినట్లే.

చీజ్: జున్నులో కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. మీ ఆహారంలో ఎక్కువగా పాల పదార్థాలను చేర్చడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీ శరీరం ఇతర ఆహారాల కంటే పాల ఉత్పత్తుల నుంచి కాల్షియంను త్వరగా గ్రహిస్తుంది. పాల ఉత్పత్తులతో ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

బీన్స్: ఫైబర్, మాంసకృత్తులు, ఇతర ఖనిజాలు బీన్స్‌లో అధికంగా ఉంటాయి. ఇవి కాల్షియానికి కూడా మంచి మూలం అని చెప్పుకోవాలి. ఇవి మీ ఎముకల ఆరోగ్యంతో పాటు, శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..