AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Freezing: ఇలా కూడా తల్లి కావొచ్చా? ప్రియాంక చొప్రా చెప్పిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ అంటే ఏమిటి? పూర్తి వివరాలు..

సాధారణంగా మహిళల్లో విడుదలయ్యే అండాల నాణ్యత వయసుతో పాటు తగ్గిపోతుంది. 35 ఏళ్లు దాటక మరింతగా క్షీణించిపోతాయి. అయితే మహిళల చిన్నవయసులోని అండాలను తీసి ఫ్రీజింగ్ చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మహిళలు గర్భధారణ చేసుకునేందుకు వీలవుతుంది.

Egg Freezing: ఇలా కూడా తల్లి కావొచ్చా? ప్రియాంక చొప్రా చెప్పిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ అంటే ఏమిటి? పూర్తి వివరాలు..
Priynaka Chopra Egg Freezing
Madhu
|

Updated on: Apr 03, 2023 | 2:48 PM

Share

ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కరలేని పేరు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ప్రమోటయ్యి గ్లోబల్ స్టార్ గా రాణిస్తున్న కథనాయిక. అయితే ఇటీవల ఆమె వేరే కారణాల వల్ల ఎక్కువ వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని ఓ విషయాన్ని చెప్పి అందరినీ షాకింగ్ కు గురిచేసింది. సరోగసి ద్వారా పిల్లలను కనడంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక చోప్రా సమాధానం చెబుతూ తనకు పిల్లలంటే చాలా ఇష్టమని అందుకోసమే పెళ్లికి ముందే ప్లాన్ చేసుకున్నానని వివరించింది. అందుకోసం తన అండాలను ముందే దాచిపెట్టానని వివరించింది. అందుకోసం గైనకాలజిస్ట్ అయిన తన తల్లి మధు చోప్రా సలహా తీసుకొని 30 ఏళ్ల వయసులోనే అండాలను దాచిపెట్టినట్లు వివరించింది. అలా చేయడం వల్ల తనకు స్వేచ్ఛగా అనిపించిందని పేర్కొంది. ఆ స్వేచ్ఛతోనే కెరీర్ అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇది సాధ్యమేనా అని సగటు మనిషికి ప్రశ్న తలెత్తుంది. అసలు స్త్రీ అండాలను బయటకు తీయడం ఏమిటి? దానిని దాచిపెట్టడం ఏమిటి? వైద్య పరిభాషలో ఈ ప్రక్రియ పేరేంటి? ఎలా చేస్తారు? పూర్తి వివరాలు మీ కోసం..

ఎగ్ ఫ్రీజింగ్..

ఒక స్త్రీ తన ఇష్టపూర్వకంగా తన అండాలను దాచిపెట్టుకొనే ప్రక్రియను వైద్య పరిభాషలో ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. సాధారణంగా ఓ మహిళకు పన్నెండెళ్లు దాటిన తర్వాత అండాలు విడుదల అవడం ప్రారంభం అవుతుంది. దీన్నే అండోత్సర్గం అంటారు. 18-30 ఏళ్ల మధ్యలో విడుదలయ్యే అండాలు నాణ్యంగా ఉంటాయి. అటువంటి సమయంలో పిల్లలని కనొచ్చు. 30 తర్వాత విడుదలయ్యే అండాలు బలహీనంగా మారతాయి. అందుకో 30 ఏళ్ల లోపు పిల్లల్ని కనాలని పెద్దలు చెప్తారు. అందుకనే చాలా మంది మహిళలు యుక్తవయసులోని అండాలను దాచిపెట్టుకొని అవసరమైనప్పుడు సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారు. మనకు తెలిసిన చాలా మంది స్టార్స్ అనుసరిస్తున్న పద్ధతి కూడా ఇదే. ప్రియాంక చోప్రా తర్వాత లేడి సూపర్ స్టార్ నయనతార, విగ్నేష్ దంపతులు కూడా సరోగసీ ద్వారానే కవలలకు జన్మనిచ్చారు. ఎగ్ ఫ్రీజింగ్ చేయించి తమకు నచ్చినప్పుడు బిడ్డలను కనేలా ఇది సహాయపడుతుంది. ఇదొక శాస్త్రీయ ప్రక్రియ. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అండాలను ఎన్ని సంవత్సరాలైనా ఎటువంటి నష్టం కలగకుండా భద్రపరుచుకోవచ్చు.

ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారు..

ఎగ్ ఫ్రీజింగ్ ని శాస్త్రీయంగా ఓసైట్ క్రయోప్రెజర్వేషన్ అని అంటారు. ప్రతి ఆడపిల్ల పుట్టుకతోనే కొన్ని లక్షల అపరిపక్వ అండాలతో పుడుతుంది. పన్నెండేళ్ళు దాటిన తర్వాత అండం విడుదలవడం మొదలువుతుంది. దీన్నే అండోత్సర్గం అంటారు. ఈ ఫ్రీజింగ్ పద్ధతిలో భాగంగా అండాలను తీసి జాగ్రత్తగా నిల్వ చేస్తారు. మహిళల అండాలను భధ్రపరిచే విధంగా మగవారి స్పెర్మ్ కూడా ఫ్రీజింగ్ చేయవచ్చు. వీటిని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు కనడానికి ఉపయోగించుకుంటారు. స్త్రీ అండాలను బయటకి తీసి విట్రిఫికేషన్( ఫ్లాష్ ఫ్రీజింగ్) అనే ఆధునాతన ఫ్రీజింగ్ టెక్నిక్ ని ఉపయోగించి -196 సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద క్రయో ప్రెజర్వ్ చేస్తారు. అలా వాటిని ఫ్రీజింగ్ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. అప్పటి వరకు వాటిని ద్రవ నైట్రోజన్ లో భద్రపరుస్తారు. ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న పద్ధతి. అయితే ఇలా పిల్లల్ని కనడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఎవరు చేయాలి.. ఎప్పుడు చేయాలి..

కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని చాలా మంది మహిళలు గర్భం దాల్చడానికి ఆలోచిస్తారు. తమ లక్ష్యాలను అందుకోలేమని బాధపడతారు. అలాంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. గర్భధారణ ఆలస్యం కావాలి అని కోరుకునే వారికి అది తోడ్పాటును అందిస్తుంది. సాధారణంగా మహిళల్లో విడుదలయ్యే అండాల నాణ్యత వయసుతో పాటు తగ్గిపోతుంది. 35 ఏళ్లు దాటక మరింతగా క్షీణించిపోతాయి. దీని వల్ల గర్భం దాల్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అయితే మహిళల చిన్నవయసులోని అండాలను తీసి ఫ్రీజింగ్ చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మహిళలు గర్భధారణ చేసుకునేందుకు వీలవుతుంది. అలాగే కొన్ని రకాల వైద్య చికిత్స చేయించుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కీమోథెరపీ లేదా రేడియేషన్ వంటి కొన్ని వైద్య చికిత్సలు స్త్రీ అండాల నాణ్యతను, నిల్వను దెబ్బతీస్తాయి. ఫలితంగా ఆమె సంతానోత్పత్తిని తగ్గిస్తాయి. అటువంటి చికిత్సలు చేయించుకునే ముందు తమ అండాలను ఫ్రీజ్ చేయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని హెల్త్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..