Prudvi Battula |
Updated on: Apr 03, 2023 | 3:29 PM
వేసవిలో మార్కెట్‌లో జామ, పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి.అలాగే కర్భూజ కూడా విరివిగా లభిస్తుంది. ఈ పండు విలువ మనలో చాలా మందికి తెలియదు.
కర్భూజ పండులోని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడే బీటా కెరోటిన్ కంటి చూపును కాంతివంతం చేయడంతో పాటు, కంటిశుక్లం రాకుండా కాపాడుతుంది.
కర్భూజ జ్యూస్ లో ఉండే ఆక్సికోడోన్ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజువారీ డైట్ లో కర్భూజ పండు తీసుకుంటే కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి.
ఈ పండు తీసుకోవడం వాళ్ళ రుతుక్రమంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. అదే సమయంలో పుచ్చకాయ తొక్క ,విత్తనాలు మన చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఈ పదార్ధాన్ని ఫేస్ ప్యాక్‌లో వేసుకుంటే పొడి చర్మం బాగానే ఉంటుంది.
పుచ్చకాయలాగే కర్భూజలో కూడా ఎక్కువ శాతం నీరు ఉండడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్‌తో సహా అన్ని రకాల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
కర్భూజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఈ పండులోని ఫైటోకెమికల్స్ కారణంగా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.