- Telugu News Photo Gallery Nita mukesh ambani cultural centre bhumi pednekar natasha poonwalla malaika different dress style Telugu News
NMACC Gala: అంబానీ ఈవెంట్‌లో వింత ఫ్యాషన్..! తారలు ధరించిన దుస్తులు చూస్తే అవాక్కవ్వాల్సిందే!
ముంబై వేదికగా జరుగుతున్న నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ రెండో రోజు కూడా అట్టహాసంగా జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్ పలువురు పెద్ద స్టార్స్ తో సందడిగా మారింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కి బాలీవుడ్ తారలోకం దిగివచ్చింది. ఈ సందర్భంగా వారు ధరించిన దుస్తులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
Updated on: Apr 03, 2023 | 3:27 PM

Bhumi- నటి భూమి పెడ్నేకర్ కూడా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచ్‌కు హాజరయ్యారు. రెండో రోజు భూమి సిల్వర్ కలర్ డ్రెస్‌లో ఈవెంట్‌కి వచ్చింది. అయితే ఆమె ధరించిన డ్రెస్ చూసి అందరూ ఒకింత షాక్ అయ్యారనుకోండి.

Bhumi 2- భూమి పెడ్నేకర్ ఈ వింత శైలి వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఆమె డ్రెస్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదేం డ్రస్‌రా బాబోయ్ అంటూ.. కొందరు నెటిజన్లు ఆమె డ్రస్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ఆమె ఫ్యాషన్‌ని చూసి తెగ పొగిడేస్తున్నారు.

Naatsha- అదార్ పూనావాలా భార్య, మోడల్ నటాషా పూనావాలా ఎప్పుడూ ఆఫ్-కలర్ డ్రెస్‌ల్లోనూ కనిపిస్తుంటారు. కానీ, ఈ ఈవెంట్‌లో ఆమె విచిత్రమైన డ్రెస్‌లో కనిపించింది.

Malaika-ఈ కార్యక్రమంలో మలైకా అరోరా కూడా కనిపించింది. కలర్ ఫుల్ ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో మలైకా అరోరా ఫ్యాషన్ చాలా డిఫరెంట్‌గా ఉంది.

Karan - కరణ్ జోహార్ తన డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్‌కి తనకు తానే సాటిగా నిలుస్తుంటారు. ఈ కార్యక్రమంలో కూడా కరణ్ ప్రత్యేక డ్రెస్‌లో కనిపించాడు. అతను డిఫరెంట్ స్టైల్ షేర్వానీ ధరించి కనిపించాడు.




