Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting tips: పదే పదే అదే విషయాన్ని పిల్లలకు చెబుతున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే!

మీ పిల్లలకు మీరు స్వేచ్ఛను ఇవ్వడం లేదా? ఎప్పుడూ అది చేయొద్దు.. ఇది చేయొద్దు అని వారిస్తున్నారా? చెప్పిందే పది సార్లు చెప్పి విసిగిస్తున్నారా? అయితే తల్లిదండ్రులుగా మీ ప్రవర్తన మార్చుకోవాల్సిన సమయం వచ్చింది.

Parenting tips: పదే పదే అదే విషయాన్ని పిల్లలకు చెబుతున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే!
nagging
Follow us
Madhu

|

Updated on: Feb 24, 2023 | 4:10 PM

మీ పిల్లలకు మీరు స్వేచ్ఛను ఇవ్వడం లేదా? ఎప్పుడూ అది చేయొద్దు.. ఇది చేయొద్దు అని వారిస్తున్నారా? అయితే తల్లిదండ్రులుగా మీ ప్రవర్తన మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ వ్యవహార శైలి మీ పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ పిల్లలే తప్పు చేస్తున్నట్లు భావించకూడదని నిపుణులు వివరిస్తున్నారు. వారు తప్పులు చేస్తున్నప్పడు వారి తప్పులు సరిదిద్దుతూనే మనం చేసే చిన్న మిస్టేక్స్ కూడా పిల్లల ముందుకు ఒప్పుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడు పిల్లల కూడా తన తప్పులను అంగీకరించేలా తయారవుతారని సూచిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మీరు మంచి తల్లిదండ్రులుగా మారడంతో పాటు మీ పిల్లలకు మంచి అలవాట్లు, పద్ధతులు నేర్పిన వారవుతారని వివరిస్తున్నారు. ఈనేపథ్యంలో తల్లిద్రండ్రులు పాటించవలసిన చిన్న చిన్న చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

వీటిని తల్లిదండ్రులు విడిచిపెట్టాలి..

కోపంలో ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడవద్దు.. మీ మూడ్ బాగోలేదు. ఏదో ఆఫీస్ విషయమో లేక ఇంట్లో బంధువుల విషయంలోనే కాస్త కోపంగా ఉన్నారు అనుకోండి.. ఆ సమయంలో మీ పిల్లలకు ఏది బోధించకపోవడం ఉత్తమం. ఎందుకంటే మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నప్పుడు పిల్లలకు ఏదైనా సూచిస్తే వారిలో అది కోపానికి దారి తీయొచ్చు. ఒక వేళ మీ పిల్లలపైనే మీకు కోపంగా ఉంటే.. ఆ సమయంలో కూడా వారికి ఏది బోధించకూడదు. మొదట మీరు శాంతపడి ఆ తర్వాత పిల్లలతో మాట్లాడాలి.

పిల్లల ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి.. మీ పిల్లలకు తగిన స్వేచ్ఛ ఇచ్చి.. వారితో ఎమోషనల్ గా కనెక్ట్ కావడానికి ట్రై చేయాలి. అది పిల్లల్లో మీపై పాజిటివిటీ పెంచి, ఏదైనా మీతో షేర్ చేసుకొనే విధంగా తయారవుతారు.

ఇవి కూడా చదవండి

అతిగా ఆశించవద్దు.. పిల్లలపై భారీగా అంచనాలు పెట్టుకొని.. మీ అంచనాలను పిల్లలు అందుకోవాలని, మీ భావాలను వారిపై రుద్దడం సరికాదు. వారు ఎంత వరకూ అది చేయగలరో అంచనా వేసుకొని దానిని చేయమని ప్రోత్సహించాలి. ఇంకా నైపుణ్యాలను పెంచుకునేలా పాజిటివ్ యాంగిల్ లో నచ్చజెప్పాలి.

పదే పదే చెప్పొద్దు.. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలకు చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతుంటారు. ఇది పిల్లల్లో అసహనానికి కారణం అవుతుంది. పదే పదే చెవిలో జోరీగలాగా చెబుతూ ఉంటే వారిలో అది చేయాలనే ధ్యాస పోయే దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించడం ప్రారంభిస్తారు.

పిల్లల ముందు తగవులొద్దు.. పిల్లల ముందు తల్లిదండ్రలు తగవులాడకూడదు. వారి ముందు తిట్టుకోవడం.. కొట్టుకోవడం చేస్తే వారిపై అది నెగిటివ్ ప్రభావం పడుతుంది. ఒకరినొకరు గౌరవించుకొంటూ ఉంటే అది వారిలో మీపై పాజిటివ్ అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..