Biryani : బిర్యానీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఏటీంఎంలు.. ఎక్కడంటే?
మీరు బ్యాంకు ఏటీఎంలను చూసి ఉంటారు. ఏ సమయంలో వెళ్ళినా మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ చెన్నైలో మాత్రం వినూత్నంగా ఎనీ టైం బిర్యానీ సెంటర్లను ప్రారంభించారు.

మీరు బ్యాంకు ఏటీఎంలను చూసి ఉంటారు. ఏ సమయంలో వెళ్ళినా మీరు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ చెన్నైలో మాత్రం వినూత్నంగా ఎనీ టైం బిర్యానీ సెంటర్లను ప్రారంభించారు. విచిత్రంగా ఈ బిర్యాని సెంటర్లో మనుషులు ఉండరు. ఏటీఎం మిషన్ తరహాలో ఓ మిషిన్ ఉంటుంది ఆ మిషన్ పై ఉన్న స్క్రీన్ మీద మీకు కావాల్సిన ఆర్డర్ ను ప్రెస్ చేసి డబ్బులు పే చేస్తే చాలు, ఎంత సమయం వెయిట్ చేయాలో మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే పక్కనే ఉన్న కియోస్క్ లో బిర్యానీ ప్యాకెట్లు వస్తాయి. ఈ సదుపాయం ఉన్నది మరి ఎక్కడో కాదు చెన్నైలోని బీవీకే బిర్యాని సెంటర్ లో కావడం విశేషం. ఏటీఎం బ్యాంకుల తరహాలోనే ఈ బిర్యాని ఏటీఎంలు కస్టమర్లకు కొత్త ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాయి. సాధారణంగా బిర్యానీ సెంటర్ల వద్ద క్యూ కట్టి జనాలు బిర్యానీ కొనడం మనం చూసి ఉంటాము. కానీ ఈ బిర్యానీ ఏటీఎం మెషిన్ల వద్ద కూడా జనం క్యూలు కట్టి మరి బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్ చేస్తున్నారు.
బై వీటు కళ్యాణ బిర్యానీ (BVK బిర్యానీ) సెంటర్లను 2020లో కరోనా లాక్‌డౌన్‌కు సరిగ్గా 45 రోజుల ముందు ప్రారంభించారు. అయితే ఈ బిర్యానీ సెంటర్లలో మనుషులు లేకుండా కాంటాక్ట్ లెస్ పద్ధతిలో కేవలం మెషీన్ల ద్వారానే సర్వ్ చేయడం స్పెషాలిటీ, దీంతో జనం బిర్యానీ కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఫలితంగా, గత రెండేళ్లలో బీవీకే బిర్యానీ చాలా పాపులర్ అయ్యింది. జనం కూడా కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితం కావడంతో ఈ బిర్యానీ రుచి చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. సంస్థ ఫౌండర్ అలాగే సీఈఓ ఫహీమ్ తమ బీవీకే బిర్యానీ సెంటర్స్ సక్సెస్ అవడం వెనుక ఉన్న కృషిని తెలియజేశారు. టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారు చాలా మంది తమ బిర్యానీ సెంటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపించారని, కానీ రుచి, నాణ్యత మెయిన్ టెయిన్ చేయడం వల్లే, ప్రస్తుతం ఈ సక్సెస్ సాధ్యమైందని ఫహీం చెబుతున్నారు.
ఇప్పుడు బీవీకే వారి కియోస్క్‌లో అందుబాటులో ఉండే మెనూలో బిర్యానీ (మటన్, చికెన్,ఎగ్), స్టార్టర్స్ (చికెన్ 65, ఫ్రైడ్ చికెన్, కోలా ఉరుండై), డెజర్ట్‌లు ( ద్రాక్ష రసం, ఎలనీర్ పాయసం), శాఖాహార డిషెస్ (వెజ్ బిర్యానీ) వంటి పదార్థాలు ఉన్నాయి. టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేపై బిర్యానీ విభాగంలో మినీ, రెగ్యులర్, బకెట్ వంటి ఆప్షన్స్ సైతం ఉన్నాయి.




బీవీకే బిర్యానీ వారి సెంట్రలైజ్డ్ కిచెన్స్ నెర్కుండ్రం, తోరైపాక్కంలో ఉన్నాయి. ఇవి అటు ఉత్తర, దక్షిణ చెన్నైలను కవర్ చేస్తాయని ఫహీం తెలిపారు. ఇక కళ్యాణ నాష్తా పేరిట బ్రేక్ ఫాస్ట్ సైతం అందిస్తున్నారు. వీటిలో ఇడియప్పం, ఇడ్లీ, పరోటా, నాన్ వెజ్ టిఫిన్స్ సైతం ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం



