Health: బిర్యానీ ఆకుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

బిర్యానీ ఆకులు వంటకాలకు మంచి రుచిని ఇస్తాయి. మాంసాహారానికే కాకుండా శాకాహారానికి కూడా చక్కటి రుచిని ఇస్తాయి. రుచితో పాటు.. శరీరానికి కూడా మంచి పోషకాలను అందిస్తుంది. ఇందులో ఉన్న ఔషధ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.....

Ganesh Mudavath

|

Updated on: Feb 24, 2023 | 8:37 PM

శరీరానికి మేలు చేసే పొటాషియం, కాపర్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు బిర్యానీ ఆకుల్లో ఉన్నాయి. బిర్యానీ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శ్వాసకోశ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. ఫంగల్ ఇన్పెక్షన్స్ ను తగ్గించడంలో నివారిణిగా ఉపయోగపడుతుంది.

1 / 5
బిర్యానీ ఆకులలో పార్థినోలైడ్ అనే ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియెంట్ ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది. బిర్యానీ ఆకులలో లినాలూల్ ఉంటుంది. ఇది శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆకుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు, చర్మ ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుంది.

2 / 5
ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు రాత్రిపడుకునే ముందు రెండు బిర్యానీ ఆకులను తీసుకుని దానిని కాల్చి గదిలో ఉంచినట్లయితే దాని నుంచి వచ్చే పొగ ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే కచ్చితంగా బిర్యానీ ఆకులను తింటే ఉపశమనం లభిస్తుందంటున్నారు.

3 / 5
ఇందులో కెఫిన్ యాసిడ్, రుటిన్ అనే రెండు సమ్మేళనాలు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె కేశనాళికల గోడలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. చెడె కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.  బిర్యానీ ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది.

4 / 5
బిర్యానీ ఆకులను ఉపయోగించి అరోమాథెరపీ చేసినట్లయితే శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఈ బిర్యానీ ఆకు డయాబెటిస్ రోగులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఈ బిర్యానీ ఆకులో ఉండే ఔషదగుణాల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది.

5 / 5
Follow us