AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా ఎయిర్‌పోర్టు ప్రమాదంలో తనువు చాలించిన తెలుగు వ్యక్తి

అమెరికాలో జరిగిన ఎయిర్‌పోర్ట్‌ బస్సు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. భారత్‌ నుంచి వస్తున్న తన స్నేహితుడిని పికప్‌ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లి అనుకోని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోస్టన్‌లోని లోగన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది..

అమెరికా ఎయిర్‌పోర్టు ప్రమాదంలో తనువు చాలించిన తెలుగు వ్యక్తి
Indian-American died in USA
Srilakshmi C
|

Updated on: Apr 04, 2023 | 7:01 AM

Share

అమెరికాలో జరిగిన ఎయిర్‌పోర్ట్‌ బస్సు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి చెందాడు. భారత్‌ నుంచి వస్తున్న తన స్నేహితుడిని పికప్‌ చేసుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లి అనుకోని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోస్టన్‌లోని లోగన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన విశ్వచంద్‌ కోళ్ల (47) అమెరికాలోని తకెడ ఫార్మాస్యూటికల్‌ సంస్థలో డేటా అనలిస్ట్‌గా పని చేస్తున్నారు. భారత్‌ నుంచి వస్తున్న విశ్వచంద్‌ స్నేహితుడైన ఓ సంగీత వాయిద్య కళాకారుడిని మాసాచుసెట్స్‌ రాజధాని బోస్టన్‌ సిటీలోని లోగన్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ నుంచి పికప్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్టుకు మార్చి 28 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెళ్లారు. తన ఎస్‌యూవీ వాహనంలో విమానాశ్రయం బయట టెర్మినల్‌-బి వద్ద వేచి చూస్తున్నారు.

ఈక్రమంలో అటువైపుగా వస్తున్న డార్ట్‌మౌత్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన వాహనం ఎస్‌యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ రెండు వాహనాల మధ్య నలిగిపోయి విశ్వచంద్‌ అక్కడికక్కడే మృతి చెండారు. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య సౌజన్య, కుమారులు ధృవ, మాధవ్‌ ఉన్నారు. విశ్వచంద్‌ పని చేస్తున్న ఫార్మా సంస్థ ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. మరోవైపు విశ్వచంద్‌ స్నేహితులు ‘గో ఫండ్‌ మి’ పేరిట వెబ్‌పేజీని క్రియేట్‌ చేసి ఇప్పటి వరకు 4,06,151 (రూ.3.3 కోట్లు) అమెరికన్‌ డాలర్లు విరాళంగా సేకరించారు. ఈ మొత్తాన్ని మృతుడి కుటుంబానికి అందజేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్
అందుకే మంగ్లీని టార్గెట్ చేశారు.. నోరువిప్పిన శివ చౌహాన్
దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక
దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు మృతి
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్‌ టాపర్ గా సక్సెస్
నాడు
వీరికి అదే వరం..M అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వారి గుణ గణాలు ఇవే
వీరికి అదే వరం..M అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే వారి గుణ గణాలు ఇవే
చెక్ మీద సంతకం పెట్టే ముందు ఇవి తెలుసుకోండి.. ఈ తప్పులు చేస్తే..
చెక్ మీద సంతకం పెట్టే ముందు ఇవి తెలుసుకోండి.. ఈ తప్పులు చేస్తే..
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్‌ ఏం చేసాడంటే
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్‌ ఏం చేసాడంటే
బాబోయ్..బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారా..
బాబోయ్..బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారా..
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
అల్లరి సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి రవిబాబు కామెంట్స్
అల్లరి సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి రవిబాబు కామెంట్స్