Secunderabad Railways: మన రైల్వే శాఖ పనితీరును ‘చెప్పు’కోవాల్సిందే.. మీకూ ఎప్పుడైనా ఇలా జరిగిందా..?
ఠంచన్‌గా పరుగెత్తుకొచ్చి కొందరు ప్రయాణికులు ఆఖరు నిముషంలో రైలు ఎక్కుతుంటారు. ఈక్రమంలో కాలికున్న చెప్పులు, చేతిలోని మరేదైనా వస్తువు జారవిడుచుకోవడం షరామామూలే. తిరిగి తెచ్చుకుందామంటే ఈలోపు రైలు కదిలి ముందుకు వెళ్లిపోతుంది. రైలును ఆపలేక, జరవిడుచుకున్న వస్తువుపై మనసు చంపుకోలేక యాతనపడిపోతుంటారు..
ఠంచన్‌గా పరుగెత్తుకొచ్చి కొందరు ప్రయాణికులు ఆఖరు నిముషంలో రైలు ఎక్కుతుంటారు. ఈక్రమంలో కాలికున్న చెప్పులు, చేతిలోని మరేదైనా వస్తువు జారవిడుచుకోవడం షరామామూలే. తిరిగి తెచ్చుకుందామంటే ఈలోపు రైలు కదిలి ముందుకు వెళ్లిపోతుంది. రైలును ఆపలేక, జరవిడుచుకున్న వస్తువుపై మనసు చంపుకోలేక యాతనపడిపోతుంటారు. దాదాపు ప్రతి ప్రయాణికుడి జీవితంలో ఇలాంటి సంఘటన ఒక్కటైనా జరిగుంటుంది. తాజాగా ఓ విద్యార్ధి తన కొత్త చెప్పుల్లో ఒకటి రైలెక్కుతుండగా జారిపోయిందని రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వాళ్లు వెతికిపెట్టడమేకాకుండా పోగొట్టుకున్న విద్యార్ధికి చెప్పును అప్పగించారు కూడా. ఇదెక్కడో విదేశాల్లో జరిగిందనుకుంటే పొరబాటే.. సాక్షాత్తు మన తెలంగాణలోని ముచ్చటే ఇది. వివరాల్లోకెళ్తే..
జనగామ జిల్లా చిలుపూరు మండలం పల్లగుట్టకు చెందిన రాజేష్ (25) అనే విద్యార్ధి శనివారం (ఏప్రిల్ 1) సికింద్రాబాద్ వెళ్లడానికి స్టేషన్ ఘణపురం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. కదులుతున్న రైలు ఎక్కుతుండగా తన కాలికి ఉన్న ఒక చెప్పు జారి రైలు పట్టాల మధ్యలో పడింది. అవి కొత్త చెప్పులని, తనకు ఆ చెప్పులంటే చాలా ఇష్టమని చెబుతూ రైల్వే అధికారులకు ట్వీట్ చేశాడు. దీనిపై సికింద్రాబాద్ డివిజనల్ భద్రతాధికారి దేబాస్మిత స్పందించి కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ బాధిత విద్యార్థి చెప్పును వెతికి కాజీపేటకు తీసుకువచ్చారు. రాజేష్‌కు ఆదివారం ఆ చెప్పును అప్పగించారు. చెప్పు రికవరీ చేయడం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ప్రస్తుతం ఈ సంఘటన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.