AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upset Over Haircut: హెయిర్‌ స్టైల్‌ నచ్చలేదనీ.. 16వ అంతస్తునుంచి దూకిన బాలుడు

చిన్న చిన్న కారణాలకే యువత తనువు చాలిస్తున్నారు. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు. తాజాగా ఓ 13 ఏళ్ల బాలుడు హెయిర్‌కట్‌ నచ్చలేదని ఏకంగా 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన..

Upset Over Haircut: హెయిర్‌ స్టైల్‌ నచ్చలేదనీ.. 16వ అంతస్తునుంచి దూకిన బాలుడు
Boy Suicide Upset Over Haircut
Srilakshmi C
|

Updated on: Apr 07, 2023 | 10:16 AM

Share

చిన్న చిన్న కారణాలకే యువత తనువు చాలిస్తున్నారు. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు. తాజాగా ఓ 13 ఏళ్ల బాలుడు హెయిర్‌కట్‌ నచ్చలేదని ఏకంగా 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలో గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్రలోని థానే జిల్లా భయాందర్‌ నగరానికి చెందిన ‌13 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు హెయిర్‌ కట్‌ చేయించారు. సెలూన్‌లో చేసిన హెయర్‌ స్టైల్‌ బాలుడికి నచ్చలేదు. కోపోధ్రిక్తుడైన బాలుడు అద్దంలో పదే పదే ఆ హెయిర్‌ స్టైల్‌ను చూసుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తాము నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని 16వ అంతస్తు బాత్రూం కిటికీలో నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నవ్‌ఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై యాక్సిడెంటల్‌ డెత్‌ రిపోర్టు (ఏడీఆర్‌) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఓ పోలీసధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us