Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS Officers in AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. అప్రాధాన్య హోదాలకు పోస్టింగ్‌లు! మర్మమదేనా..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 57 మంది అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేయడంతో సర్వత్రా చర్చణీయాంశమైంది..

IAS Officers in AP: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. అప్రాధాన్య హోదాలకు పోస్టింగ్‌లు! మర్మమదేనా..?
IAS Transfer in AP
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2023 | 7:11 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 57 మంది అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. వీరిలో కొందరు సీనియర్‌ అధికారులుకాగా, 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, 9 జిల్లాలకు జాయింట్‌ కలెక్టర్లుగా బదిలీ అయ్యారు. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేయడంతో సర్వత్రా చర్చణీయాంశమైంది. కీలక హోదాల్లో ఉన్న అధికారులను సైతం అప్రాధాన్య పోస్టుల్లో నియమించడం కొసమెరుపు. గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ ఆర్‌.పి.సిసోదియాను ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ పోస్టులో నియమించింది. కొన్ని రోజుల క్రితం అప్పటి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలసి, జీతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేశారు. వారికి సిసోదియానే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పించారన్న కారణంతో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని చర్చించుకుంటున్నారు. గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని హఠాత్తుగా తప్పించి, ఆయనను కూడా మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్‌గానే నియమించింది. దీంతో ఆ పోస్టు ‘పనిష్మెంట్‌’ పోస్టుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇదే తరహాలో వైకాపా ప్రభుత్వం మిగతా ఐఏఎస్‌లను కూడా అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసిందని చర్చించుకుంటున్నారు.

ఒకేసారి 57 మంది IAS అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం

  • జి.అనంత రాము -మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  • RP సిసోడియా – APHRD డీజీ
  • B.శ్రీధర్ – ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబెర్ సెక్రటరీ
  • సౌరభ్ గౌర్ – ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీ
  • రిటైర్డ్ అధికారి ఆదిత్య నాధ్ దాస్ ను బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.
  • కోన శశిధర్ – ఐటీ శాఖ కార్యదర్శి
  • కె.హర్షవర్ధన్ – శాప్ ఎండీ
  • ఎంవీ శేషగిరి బాబు – కార్మిక శాఖ కమిషనర్
  • ఎం. హరిజావహర్ లాల్ – కార్మిక కర్మాగారాలు బాయిలర్స్ కార్యదర్శి
  • ప్రవీణ్ కుమార్ – APIIC ఎండీ
  • ఎస్.సత్యనారాయణ – దేవదాయ శాఖ కమిషనర్
  • పి.బసంత్ కుమార్ – స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ఎండీ
  • ఎ. సూర్యకుమారి – పంచాయతీ రాజ్ కమిషనర్
  • పి.కోటేశ్వరరావు – మున్సిపల్ శాఖ డైరెక్టర్
  • కేవీఎన్ చక్రధర్ బాబు – ఏపీ జెన్కో ఎండీ
  • ఎం. హరినరాయన్ – నెల్లూరు కలెక్టర్
  • ఎస్.నాగలక్ష్మి – విజయనగరం కలెక్టర్
  • ఎన్. ప్రభాకర్ రెడ్డి – సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ
  • ఎస్ షన్మోహన్ – చిత్తూరు కలెక్టర్
  • ఎస్.సృజన – కర్నూల్ కలెక్టర్
  • కె.విజయ – సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్
  • పి.రంజిత్ బాషా – బాపట్ల కలెక్టర్
  • పి.రాజ బాబు – కృష్ణా జిల్లా కలెక్టర్
  • జీసీ.కిషోర్ కుమార్ – జీఎడి కి రిపోర్ట్
  • పి.అరుణ్ బాబు – సత్యసాయి కలెక్టర్
  • ఎం. గౌతమి – అనంతపురం కలెక్టర్
  • బి.లావణ్య వేణి – ఏలూరు కలెక్టర్
  • ఎం. విజయ సునీత – మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్
  • ఎ. సిరి – పార్వతీ పురం మన్యం జాయింట్ కలెక్టర్
  • జె.వెంకట మురళి – ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్
  • ఎస్.రామ సుందర్ – పశ్చిమగోదావరి జేసీ
  • సీఎం సైకత్ వర్మ – విశాఖ మున్సిపల్ కమిషనర్
  • తమీమ్ అన్సారియా – జీఎడి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
  • సీహెచ్ శ్రీధర్ – ప్రకాశం కలెక్టర్
  • ఎస్.వెంకటేశ్వర్ – AP వైద్య విధాన పరిషత్ కమిషనర్
  • వి.వినోద్ కుమార్ – ఎండీ,స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్37.బి.నవ్య – ఉపాధి కల్పన-శిక్షణ
  • పి.సంపత్ కుమార్ – NTR జిల్లా జాయింట్ కలెక్టర్
  • జి.గణేష్ కుమార్ – వైఎస్సార్ జిల్లా జేసీ
  • ఓ.ఆనంద్ కుమార్ – విశాఖ కమర్షియల్ టాక్స్ జేసీ
  • మహేష్ కుమార్ రావిరాల – కాకినాడ మున్సిపల్ కమిషనర్
  • రోనంకి గోపాల కృష్ణ – అడిషనల్ డైరెక్టర్,సర్వే-సెటిల్ మెంట్ శాఖ
  • అనుపమ అంజలి – GAD కి రిపోర్ట్
  • నారపురెడ్డి మౌర్య – తిరుపతి మున్సిపల్ కమిషనర్
  • కల్పన కుమారి – పీడీ,సీతంపేట ITDA
  • బి.శ్రీనివాసరావు – సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్
  • ఎ. భార్గవ్ తేజ – అడిషనల్ డైరెక్టర్,పంచాయతీ రాజ్ శాఖ
  • హిమాన్షు కౌశిక్ – అన్నమయ్య జిల్లా జేసీ
  • ఇమ్మడి పృథ్వి తేజ్ – సీఎండీ,APEPDCL
  • ఎం. జాహ్నవి – అనకాపల్లి జేసీ
  • నుపూర్ అజయ్ కుమార్ – సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ
  • వి.అభిషేక్ – పీడీ,పాడేరు ITDA
  • వికాస్ మర్మట్ – కర్నూల్ జేసీ
  • పి.శ్రీనివాసులు – చిత్తూరు జేసీ
  • అభిషిక్త్ కిషోర్ – డిప్యూటీ సెక్రటరీ,ఫైనాన్స్ డిపార్ట్మెంట్
  • ఎస్.సురేష్ కుమార్ – ఇంటర్ బోర్డు ఇంచార్జి కమిషనర్
  • జె.వీరపాండ్యన్ – సివిల్ సప్లైస్ ఇంచార్జి డైరెక్టర్

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.