First Baby Girl Birth: 138 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు.. ఈ వంశంలో తొలిసారి పుట్టిన ఆడపిల్ల
ఆడపిల్ల పుట్టడమే అరిష్టంగా భావించేవారు మన చుట్టూ ఎందరినో చూస్తుంటాం. ప్రకృతి పగబట్టి లేదా ఆడజన్మ మనసు విరిగిపోయో ఆడపిల్లలు పుట్టడం ఆగిపోతేనో..? నో డౌట్.. ఈ సృష్టి మొత్తం ఆగిపోతుంది. ఐతే ఓ వంశంలో మాత్రం ఏ దేవుడో శపించినట్లు కొన్ని తరాల వరకు ఆడపిల్ల పుట్టడం నిజంగానే ఆగిపోయింది..
ఆడపిల్ల పుట్టడమే అరిష్టంగా భావించేవారు మన చుట్టూ ఎందరినో చూస్తుంటాం. ప్రకృతి పగబట్టి లేదా ఆడజన్మ మనసు విరిగిపోయో ఆడపిల్లలు పుట్టడం ఆగిపోతేనో..? నో డౌట్.. ఈ సృష్టి మొత్తం ఆగిపోతుంది. ఐతే ఓ వంశంలో మాత్రం ఏ దేవుడో శపించినట్లు కొన్ని తరాల వరకు ఆడపిల్ల పుట్టడం నిజంగానే ఆగిపోయింది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు మనం కథల్లో చదివుంటాం. ఐతే నిజంగానే ఓ కుటుంబంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 138 ఏళ్ల వరకు ఆ వంశానికి ఆడపిల్ల జన్మించలేదు. శతాబ్దానికిపైగా నిరీక్షణ తర్వాత చివరకు ఆ కుటుంబంలో ఆడ శిశువు జన్మించింది. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వివరాల్లోకెళ్తే..
అమెరికా మిషిగాన్‌లోని కలడోనియాలో నివసిస్తోన్న క్లార్క్ కుటుంబంలో దాదాపు 138 ఏళ్ల నుంచి ఒక్క అమ్మాయి కూడా పుట్టలేదు. అదే వంశానికి చెందిన కరోలిన్, ఆండ్రూ క్లార్క్ దంపతులకు ఇటీవల ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ కుటుంబ సభ్యులంతా సంతోషంలో మునిగిపోయారు. ప్రతిసారి 50-50 ఛాన్స్ అవకాశం ఉంటాయని డాక్టర్లు చెప్పేవారు. కానీ నేను మాత్రం గర్భం ధరించానని తెలిసినప్పుడు, అబ్బాయి పుడతాడా? లేక అమ్మాయా? అనేది పట్టించుకోలేదు. కానీ ఆశ్చర్యంగా పాప పుట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉందంటూ కరోలిన్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇతర కుటుంబాల్లో ఆడపిల్లలు ఉన్నారు కానీ తమ వంశంలో ఆడపిల్లలు పుట్టలేదంటూ తమ అత్తమామలు ఆవేదన చెందేవారని వెల్లడించింది. ఆమ్మాయి పుడుతుందనే ఆశలు కూడా వదిలేసుకున్నాం అందుకే ఏ పేరు పెట్టాలో కూడా తోచడం లేదండూ ఆండ్రూ తెలిపారు. ఈ చిన్నారికి ఆడ్రీ అని పేరు పెట్టినట్టు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.