కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడానికి అక్రమ పద్ధతులలో తీసుకువస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో 38.5 శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టకపోతే సీజ్ చేస్తాం. కిలోకు మించి తీసుకువస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. అరబ్ దేశాల నుంచి ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతుంటుంది. ముఖ్యంగా దుబాయి, జోర్దాన్, కువైట్, సూడాన్ దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉండటం వల్ల అక్రమంగా తీసుకువస్తుంటారని అధికారులు అంటున్నారు. బంగారం తీసుకెళ్లే విషయంలో ఆయా దేశాలలో ఎలాంటి ఆంక్షలు లేవు. అందుకే అక్రమ మార్గాలలో హైదరాబాద్‌కు గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు అమాయకులు, వలస కార్మికులను స్మగ్లర్లు ఎంచుకుంటారు. వారికి విమాన ప్రయాణ టికెట్లు, ఇతర ఖర్చులు పెట్టుకుంటామని ఆశచూపి స్మగ్లింగ్‌లోకి దింపుతారు. వీరిని బిహేవియర్, పర్సన్ ప్రొఫైలింగ్, మెటల్ డిటెక్టర్ల సాయంతో పరీక్షించి కస్టమ్ అధికారులు పట్టుకుంటారు.