AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ground Nuts: వేరుశెనగలు అతిగా తింటే అంతే సంగతులు.! ఆ సమస్యల బారిన పడాల్సిందే..

వంటింట్లో వేరుశెనగ లేకుండా దాదాపు ఏ ఇల్లు ఉండదు. చిరుతిండి నుంచి వివిధ వంటకాలు, చట్నీల వరకు వేరుశెనగను ఉపయోగిస్తారు. వీటిని పేదల బాదం అని పిలుస్తారు. వేరుశెనగ తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Prudvi Battula
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 07, 2023 | 1:05 PM

Share
వంటింట్లో వేరుశెనగ లేకుండా దాదాపు ఏ ఇల్లు ఉండదు. చిరుతిండి నుంచి వివిధ వంటకాలు, చట్నీల వరకు వేరుశెనగను ఉపయోగిస్తారు. వీటిని పేదల బాదం అని పిలుస్తారు. వేరుశెనగ తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

వంటింట్లో వేరుశెనగ లేకుండా దాదాపు ఏ ఇల్లు ఉండదు. చిరుతిండి నుంచి వివిధ వంటకాలు, చట్నీల వరకు వేరుశెనగను ఉపయోగిస్తారు. వీటిని పేదల బాదం అని పిలుస్తారు. వేరుశెనగ తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

1 / 7
ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. పొటాషియం, ఐరన్, జింక్ , విటమిన్-ఈ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో వేరుశెనగ తినడం మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వేరుశనగను అస్సలు తినకూడదు. ఏ సమస్యలతో బాధపడేవారు వేరుశెనగకి దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

2 / 7
థైరాయిడ్ సమస్య  మీకు థైరాయిడ్ సమస్య ఉంటే వేరుశెనగ తీసుకోవడం వల్ల మీ TSH స్థాయి పెరుగుతుంది. అందుకే వేరుశెనగ తినకూడదు. ఒకవేళ మీరు వేరుశెనగ తినాలనుకుంటే చాలా పరిమిత పరిమాణంలో తినాలి. అలాగే మందులు వాడుతున్నప్పుడు వేరుశెనగ తీసుకోకపోవడం ఉత్తమం.

3 / 7
అలెర్జీ సమస్య  మీకు అలెర్జీ ఉంటే వేరుశెనగలు తినడం మంచిది కాదు. ఎందుకంటే చేతులు, కాళ్ళలో దురద, నోటిపై వాపు లేదా చర్మంపై దద్దుర్లు సంభవించవచ్చు. వేరుశెనగలు ఎండాకాలంలో పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

4 / 7
కాలేయ సమస్య  కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు వేరుశెనగను తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తినకూడదు. వాస్తవానికి వేరుశెనగలో కొన్ని మూలకాలు ఉంటాయి. ఇవి కాలేయంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ముఖ్యంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు వీటికి దూరంగా ఉండటమే మంచిది.

5 / 7
.కీళ్ల నొప్పులు  కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేరుశెనగ తినడం మానుకోవాలి. ఇది లెక్టిన్‌లను కలిగి ఉంటుంది. ఇది నొప్పిని మరింత పెంచుతుంది.

6 / 7
అధిక బరువు  మీరు అధిక బరువు కలిగి ఉంటే వేరుశెనగను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే వేరుశెనగలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వేరుశెనగలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఉంటాయి వీటిని అధికంగా తీసుకుంటే బరువు తగ్గడంలో సమస్య ఏర్పడవచ్చు.

7 / 7