- Telugu News Photo Gallery Spiritual photos Hanuman Jayanti: Union Home Minister Amit Shah unveils 54 feet tall Hanuman statue in Gujarat
Lord Hanuman: 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్ షా.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే?
హనుమాన్ జన్మదినోత్సవ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండగ సందర్భంలో గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలోని సలాంగ్‌పూర్ ఆలయంలో 54 అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. దీంతో పాటు సలాంగ్‌పూర్ హనుమాన్ ఆలయంలో శ్రీ కష్టభంజనేవ భోజన శాలను అమిత్ షా ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌ని ఏడు ఎకరాల్లో నిర్మించారు.
Updated on: Apr 06, 2023 | 12:58 PM

ఈ విగ్రహం అహ్మదాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సలాంగ్‌పూర్ హనుమాన్ ఆలయ సముదాయంలో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా ప్రజలు శని దేవుడి కోపం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.

వాయుపుత్రుడు హనుమాన్ విగ్రహాన్ని అహ్మదాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సలాంగ్‌పూర్ హనుమాన్ ఆలయ సముదాయంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారు శనీశ్వరుడు పెట్టె కష్టాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. సమాచారం ప్రకారం, పంచధాతువుతో చేసిన 30 వేల కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని ఏడు కి.మీ దూరం నుండి చూడవచ్చు.

ఈ విగ్రహం ఖరీదు ఆరు కోట్ల రూపాయలు. కష్టభంజన్ హనుమాన్ దేవాలయం 1905 విక్రమ సంవత్సరంలో స్థాపించచారు. దీనిని సద్గురు గోపాలానంద స్వామి నిర్మించారు. గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలోని సలాంగ్‌పూర్‌లో తయారు చేసిన కాష్టభంజన్ హనుమాన్‌ను స్థానికులు హనుమాన్ దాదా అని పిలుస్తారు.

ఇక్కడ హనుమంతుడిని దర్శించుకుంటే.. ప్రజలు శనీశ్వరుడు దయ కలుగుతుందని నమ్మకం. చాలా కాలం క్రితం ప్రజలు శనిదేవుని ఆగ్రహానికి గురయ్యారని.. అప్పుడు భక్తులు హనుమంతుడిని పూజించి కష్టాల నుంచి విముక్తులయ్యారట. అప్పుడు హనుమంతుడు శనీశ్వరుడు కోపం నుండి ప్రజలను రక్షించాడని విశ్వాసం.

ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న శనీశ్వరుడిపై హనుమంతుడి పోరాటానికి బయలు దేరాడు. అప్పుడు శనీశ్వరుడు పరిష్కారం కోసం ఆలోచించి.. హనుమంతుడి నుంచి తప్పించుకోవడానికి.. ఒక పరిష్కారాన్ని ఆలోచించాడు. శనీశ్వరుడు ఒక స్త్రీ రూపం ధరించాడు.

హనుమంతుడు బ్రహ్మచారి కనుక.. స్త్రీపై ఎప్పుడు హనుమంతుడు చేయి ఎత్తడు.. ఈ విషయాన్నీ శనీశ్వరుడు గుర్తించాడు. అనంతరం శని దేవుడు.. హనుమంతుడి పాదాలపై పడి క్షమాపణ చెప్పాడు. అప్పుడు బజరంగబలి తన పాదాల క్రింద ఉంచాడు. అప్పటి నుండి శని దేవ్ కష్ట భంజన్ హనుమాన్ ఆలయంలో శనీశ్వరుడు స్త్రీ రూపంలో బజరంగబలి పాదాల క్రింద కూర్చున్నాడు. ఈ రూపంలో పూజించబడతాడు.

హనుమాన్ జయంతికి సంబంధించి రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది. శాంతిభద్రతలను కాపాడాలని, పండుగ ప్రశాంతంగా జరిగేలా చూడాలని మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉన్న ఇలాంటి ఘటనలపై నిఘా ఉంచాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. శ్రీ రామనవమి పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో మత హింసల నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఈ సలహా ఇచ్చింది.

"రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు శాంతిభద్రతలను కాపాడాలి, పండుగ సమయంలో శాంతిని కాపాడాలి.. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే అన్ని రకాల కారణాలు లేదా వ్యక్తులపై నిఘా ఉంచాలి" అని హోం మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసులకు సహాయం చేయడానికి పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర బలగాలను మోహరించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.





























