- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti people with these abilities achieve success and are an examples for others in telugu
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులు ఇతరులకు ఆదర్శం.. ప్రతి చోటా ప్రశంసలందుకుంటారంటున్న చాణక్య
ప్రతి వ్యక్తిలో కొంత మంచి, కొన్ని చెడు గుణాలు ఉంటాయి. చాణక్యుడు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి తనలో కొన్ని అలవాట్లు, విలువలను అలవర్చుకుంటే.. సమాజంలో అతని గౌరవం పెరుగుతుంది. అంతేకాదు ఇతరులకు ఉదాహరణగా మారతారు.
Updated on: Apr 06, 2023 | 2:21 PM

ఆచార్య చాణక్యుడి విధానాలు ఎంత ప్రభావవంతం అంటే ఒక సాధారణ పిల్లవాడిని అంటే చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. చాణక్యుడి విధానాలు నేటి సమాజంలోని ప్రజలు అనుసరణీయంగా పరిగణించబడుతున్నాయి. జీవితంలో ఆశించిన విజయాన్ని పొందడానికి, సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకోవడానికి ఈ విధానాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు ఇంట్లో లేదా సమాజంలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాలనుకుంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి.

భర్త, భర్తలు ఇద్దరూ ఒకరినొకరు అబద్దాలు చెప్పుకుంటుంటే.. ఆ బంధంలో బీటలు ఏర్పడతాయి. ఒకొక్కసారి ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. కనుక భార్య, భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా ఒకరితోనొకరు మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు.

మూర్ఖులు: మూర్ఖులతో సహవాసం హానికరమని చాణక్యుడు వివరించాడు. వివేకం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. మూర్ఖులు తీసుకునే చెడు నిర్ణయాలు మీపై ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మీరు స్నేహం చేయండి.

ఒక వ్యక్తి తన స్వభావాన్ని తెలియజేసేది మాట. కనుక అతని మాటలో ఎల్లప్పుడూ మర్యాద ఉండాలని చాణక్యుడు నమ్మాడు. మధురంగా మాట్లాడే వ్యక్తులు త్వరగా విజయం సాధిస్తారు. అదే సమయంలో ఏ వ్యక్తి అయినా కోపంగా, చెడుగా మాట్లాడితే వారిని ఎవరూ ఇష్టపడరు. అటువంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉండటానికి ఎవరూ ఇష్టపడరు లేదా వారితో మాట్లాడటానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో వారి జీవితంలో వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి. జీవితంలో అలాంటి వారు ఎటువంటి విజయాన్ని సాధించలేరు.

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు. అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు.




