- Telugu News Photo Gallery Spiritual photos Story Of Dharmeshvar Mahadev Temple Or Yamraj Temple In Chamba At Himachal Pradesh
Yamraj Temple: ప్రపంచంలో ఏకైక యమధర్మరాజు ఆలయం.. మరణం తర్వాత ప్రతి ఒక్కరి ఆత్మ ఇక్కడకు చేరుతుందట..
భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక దేవుళ్ళు, దేవతలను పూజిస్తారు. శివుడు, రాముడు, హనుమంతుడు, దుర్గ, లక్ష్మీదేవి వంటి అనేక దేవుళ్ల ఆలయాలున్నాయి. ఎంతో భక్తి శ్రద్దలతో ఆలయాలకు వెళ్లి తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుంటారు. అయితే సనాతన ధర్మంలో న్యాయాధిపతి మానవుల కర్మానుసారం మరణాంతరం శిక్షలను విధించే యముడుకి ఒక గుడి ఉందని మీకు తెలుసా..
Updated on: Apr 07, 2023 | 1:47 PM

భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. అనేక దేవుళ్ళు, దేవతలను పూజిస్తారు. శివుడు, రాముడు, హనుమంతుడు, దుర్గ, లక్ష్మీదేవి వంటి అనేక దేవుళ్ల ఆలయాలున్నాయి. ఎంతో భక్తి శ్రద్దలతో ఆలయాలకు వెళ్లి తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుంటారు. అయితే సనాతన ధర్మంలో న్యాయాధిపతి మానవుల కర్మానుసారం మరణాంతరం శిక్షలను విధించే యముడుకి ఒక గుడి ఉందని మీకు తెలుసా..

ప్రతి వ్యక్తి తన జీవితంలో అనేక దేవాలయాలను దర్శించుకుంటారు. అయితే దేశంలో ఎన్నో వింతలూ విడ్డురలు రహస్యాలున్న దేవాలయాలను దర్శించుకోవాలని భావిస్తారు.. అతి తక్కువ మంది మాత్రమే తమ కోర్కెను తీర్చుకోగలరు. అయితే మన దేశంలో ఈ దేవాలయంలోకి ఎవరూ వెళ్లకూడదని కోరుకుంటారు. అందుకనే ఆలయం బయటనుంచి దణ్ణం పెట్టుకుని వచ్చేస్తారు. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భర్మోర్ అనే ప్రదేశంలో ఉంది.

మనిషి మరణం తరువాత ఆత్మ మొదట ఇక్కడకు వస్తుందని హిందూ పురాణాల కథనం. మరణించిన వ్యక్తి ఎటువంటి వాడైనా సరే.. అతని ఆత్మ ఈ ఆలయానికి రావాల్సిందే.. ఈ ఆలయం ధర్మేశ్వర్ మహాదేవ దేవాలయం. ప్రపంచంలో యమరాజు కొలువైన ఏకైక దేవాలయం ఇదే.

ఈ ఆలయం సాధారణ ఇల్లులా కనిపిస్తుంది. అయితే ఈ దేవాలయకు ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో ఒక ఖాళీ గది ఉంది. ఆ గది చిత్రగుప్తుని గది అని నమ్ముతారు. చిత్రగుప్తుడు యమధర్మ రాజు ప్రధాన కార్యదర్శి. చిత్ర గుప్తుడు ఆత్మ గల మనిషి చేసిన కర్మల గురించి లెక్కించి ఉంచుతాడు. ఎవరైనా మరణించిన అనంతరం యమభటులు ఆ వ్యక్తి యొక్క ఆత్మను పట్టుకుని, ముందుగా ఈ ఆలయంలో చిత్రగుప్తుని ముందు ఉంచుతారని నమ్ముతారు.

చిత్రగుప్తుడు ఆ మనిషి చేసిన పనులను పూర్తి వివరాలను ఆత్మకు అందజేస్తాడు. ఆ తర్వాత ఆ ఆత్మను చిత్రగుప్తుని ముందు ఉన్న గదిలోకి తీసుకువెళతారు. ఈ గదిని యమరాజు ఆస్థానం అంటారు. అక్కడ సదరు వ్యక్తి పాపపుణ్యాలను అనుసరించి అక్కడ శిక్ష ఖరారు చేస్తారు.

ఇక్కడ యమరాజు తన నిర్ణయాన్ని కర్మలను బట్టి ఆత్మకు చెబుతాడని అంటారు. ఈ ఆలయంలో బంగారం, వెండి, రాగి, ఇనుముతో చేసిన నాలుగు అదృశ్య తలుపులు ఉన్నాయని కూడా విశ్వాసం. యమధర్మ రాజు నిర్ణయం తర్వాత యమదూతలు ఆత్మను దాని కర్మల ప్రకారం ఈ ద్వారాల ద్వారా స్వర్గానికి లేదా నరకానికి తీసుకువెళతారు.

ప్రతి జీవి తన కర్మలను బట్టి శిక్షను యమలోకానికి వెళ్లి అనుభవిస్తుంది. ప్రతి జీవి ప్రాణం పోయిన తర్వాత అతని ఆత్మ మొదట ఈ దేవాలయానికి తప్పక వస్తుందని నమ్మకం. ఈ విషయాన్ని గరుడ పురాణంతోపాటు మరికొన్ని పురాణాల్లోనూ ప్రస్తావించారు.





























