- Telugu News Photo Gallery Spiritual photos Sun Rays Touched The Face of Vegulamma Devi at Chebrol Village
Andhra Pradesh: అమ్మవారి ఆలయంలో అద్భుత దృశ్యం.. పులకించిపోయిన భక్తులు..
భక్తుల కొంగుబంగారం ఆ అమ్మవారు. కొలిచి మొక్కితే కోరిన కోరికలు తిరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు భక్తులు. ఇంతకీ ఆ అమ్మవారు ఎవరు? ఆ ఆలయం ఎక్కడుంది? వివరాల తెలుసుకుందాం..
Updated on: Apr 06, 2023 | 2:13 PM

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని సూర్య కిరణాలు తాకుతాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించిపోయారు. భక్తతన్మయత్వంలో మునిగిపోయారు.

ఈ అద్భుత దృశ్యం గురువారం నాడు ఆవిష్కృతం అయ్యింది. వేగులమ్మ అమ్మవారి మోమును తాకాయి సూర్యకిరణాలు. భానుడి కారణాల వెలుగులో అమ్మవారి రూపం మరింత ప్రకాశవంతంగా వెలిగిపోయింది. ఈ సుందర రూపాన్ని దర్శించుకుని పరవశించిపోయారు భక్తులు.

అయితే, వేగులమ్మ అమ్మవారికి ఆలయానికి సూర్యనారాయణ ఆలయం మాదిరి ప్రత్యేకత ఉంది. అమ్మవారి మోమును సూర్య కిరణాలు తాకుతాయి. ఆ బాణుడి కిరణాల వెలుగులో అమ్మవారి ముఖం దేదీప్యమానంగా వెలిగిపోంతుంటుంది.

ఇలాంటి విశిష్టత కలిగి కలిగిన ఆలయం మరోటి కూడా ఉంది. అది కూడా మన ఏపీలోనే ఉంది. శ్రీ వేగులమ్మ అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారి ఆలయానికి అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ఇటు తెలంగాణలోనూ మంచి గుర్తింపు ఉంది. కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు మండలం చెబ్రోలు గ్రామంలో కొలువైంది శ్రీ వేగులమ్మ అమ్మవారు. వేగులమ్మ తల్లికి నిత్య పూజలు చేస్తూ, మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తారు.

మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో విశిష్టమైన, ప్రత్యేకతను సంతరించుకున్న ఆలయాలు ఉన్నాయి. వాటిలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ స్వామి మూలవిరాట్ పాదాలను భానుడి లేలేత కిరణాలు తాకుతాయి. ఏడాదిలో రెండు సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుంది.

భక్తుల కొంగుబంగారం ఆ అమ్మవారు. కొలిచి మొక్కితే కోరిన కోరికలు తిరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు భక్తులు. ఇంతకీ ఆ అమ్మవారు ఎవరు? ఆ ఆలయం ఎక్కడుంది? వివరాల తెలుసుకుందాం..





























