Kuno National Park: కునో నేషనల్‌ పార్క్‌ నుంచి తప్పించుకున్న మరో చిరుత.. మొన్న ఒబాన్‌, నేడు ఆశా..

ఆశా అనే మరో చీతా కూనో నేషనల్​ పార్కులోని రిజర్వ్​ ఫారెస్ట్ దాటి వీర్​పుర్​ ప్రాంతంలోని బఫర్​ జోన్​లోని వెళ్లిపోయింది. ఆశా ఎక్కువగా బఫర్ జోన్​లోని నదుల వెంట సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.పీఎం మోదీ స్వయంగా ఈ చీతాకు ఆశా పేరు పెట్టారు.

Kuno National Park: కునో నేషనల్‌ పార్క్‌ నుంచి తప్పించుకున్న మరో చిరుత.. మొన్న ఒబాన్‌, నేడు ఆశా..
Cheetah Asha
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2023 | 10:03 AM

కునో నేషనల్‌ పార్క్‌నుంచి మరో చిరుత తప్పించుకుపోయింది. గతేడాది నమీబియానుంచి భారత ప్రభుత్వం 8 చీతాలను ప్రత్యేక బోయింగ్‌ విమానంలో తెప్పించింది. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా విడిచి పెట్టారు. భారత్‌లో అంతరించిపోతున్న చీతాల జాతిని సంరక్షించేందుకు ప్రధాని విదేశాలనుంచి వీటిని తెప్పించారు. ప్రధాని మోదీ వాటికి పేర్లను కూడా పెట్టారు. వాటిని ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారు. ఇటీవల ఒబాన్‌ అనే చిరుత తప్పించుకుపోయింది. ఎట్టకేలకు దాని ఆచూకీ కనిపెట్టి జాగ్రత్తగా మళ్లీ పార్క్‌లో వదిలిపెట్టారు.

తాజాగా ఆశా అనే చిరుత పార్క్‌నుంచి తప్పించుకుంది. రిజర్వ్‌ ఫారెస్ట్‌ దాటి వీర్‌పూర్‌ ప్రాంతంలోని బఫర్‌జోన్‌లో నదుల వెంబడి సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు ఈ చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు. మరోవైపు చిరుత తప్పించుకుని బఫర్‌జోన్‌లో సంచరిస్తుందని తెలిసి, పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, చిరుతలు జనావాసాల్లోకి రావని చెబుతున్నారు. మరోవైపు నిర్దేశిత ప్రాంతం దాటి చిరుతలు బయటకు వెళ్తుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతల్లో సాషా అనే ఆడ చిరుత అనారోగ్యం కారణంగా గత నెలలో మృతి చెందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..