Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revenue from Waste: వ్యర్ధాలకు అర్ధాన్ని చెబుతూ.. చెత్తతో నెలకు రూ.2 లక్షల డబ్బు సంపాదిస్తున్న మున్సిపాలిటీ.. ఎక్కడంటే

సంబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ సిటీలో రోజూ 110 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. మొత్తం 9 వెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొదట సేకరించిన చెత్తను వెల్త్ సెంటర్లకు తీసుకొస్తారు. ‘‘గ్లాస్, పేపర్, కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్, మెటల్, ప్లాస్టిక్, టైర్లు, బట్టలతో సహా 16 రకాల రీసైకిల్ చేయగలిగే వ్యర్థాలు ఉన్నాయి.

Revenue from Waste: వ్యర్ధాలకు అర్ధాన్ని చెబుతూ.. చెత్తతో నెలకు రూ.2 లక్షల డబ్బు సంపాదిస్తున్న మున్సిపాలిటీ.. ఎక్కడంటే
generates revenue from waste
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2023 | 2:19 PM

పుడమి మీద వ్యర్ధాలు సృష్టిస్తున్న అనర్ధాల గురించి తెలిసిందే.. అయితే ఆ వ్యర్ధాలకు అర్ధాన్ని కలిపిస్తూ.. ఆదయ వనరులుగా మార్చుకుంటున్నారు కొందరు. ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న చెత్తను ప్రాసెస్ చేసి మళ్ళీ అమ్మి నెల నెలా లక్షలు ఆర్జిస్తోంది ఓడిశాలోని ఓ పౌరసంఘం వివరాల్లోకి వెళ్తే..

ఒడిశాలోని సంబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ తాము ఇంటింటి నుంచి సేకరిస్తున్న చెత్త నుంచి ఆదాయం పొందుతోంది. తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తారు. అలా సేకరించిన చెత్తను మళ్ళీ ప్రాసెస్ చేసి అమ్మి ప్రతి నెల రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ సంపాదిస్తోంది.

ఇదే విషయంపై ఎస్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శుభాంకర్ మహంతి మాట్లాడుతూ.. ఇళ్లు, వ్యాపార సంస్థల నుంచి రీసైకిల్ చేసే వ్యర్ధాలను సేకరిస్తున్నాం. ఇలా రీసైక్లింగ్ చేయదగిన వ్యర్థాలను టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీ కొనుగోలు చేస్తుందని తెలిపారు. అంతేకాదు టెండర్ ప్రాసెస్ చేసే ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసి.. ఆ సంస్థకు చెత్తను అమ్ముతున్నాం’’ మహంతి తెలిపారు. SMC పరిధిలోని అన్ని గృహాలు ఇంటింటికీ చెత్త సేకరణ కింద ఉన్నాయి. 80 బ్యాటరీతో నడిచే వాహనాలు సహా 130 వాహనాలతో చెత్త సేకరిస్తున్నామని వివరించారు.

ప్రాసెసింగ్ ఎలా చేస్తారంటే… సంబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ సిటీలో రోజూ 110 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. మొత్తం 9 వెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొదట సేకరించిన చెత్తను వెల్త్ సెంటర్లకు తీసుకొస్తారు. ‘‘గ్లాస్, పేపర్, కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డ్, మెటల్, ప్లాస్టిక్, టైర్లు, బట్టలతో సహా 16 రకాల రీసైకిల్ చేయగలిగే వ్యర్థాలు ఉన్నాయి. మెటీరియల్ రికవరీ ఫెసిలిటీతో పాటు మైక్రో కంపోస్టింగ్ సెంటర్ ని కలిగి ఉన్న వ్యర్దాలను ప్రాసెస్ కేంద్రాలకు చెత్తను తీసుకువస్తారు. నగరంలో ఉత్పత్తయ్యే బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఎంసీసీలో కంపోస్టుగా మారుస్తారు. అదేవిధంగా నాన్ డిగ్రేడబుల్ వ్యర్థాలను ఎంఆర్‌ఎఫ్‌కు తీసుకొచ్చి అక్కడ వేరు చేస్తారు.

వ్యర్థాలను వేరు చేసిన అనంతరం.. తిరిగి వినియోగించడానికి ఉపయోగపడని వ్యర్థాలను ఇంధనంగా ఉపయోగించేందుకు సిమెంట్ ఫ్యాక్టరీకి పంపుతారు. రీసైక్లింగ్ చేయగల వ్యర్థాలను ఎంచుకున్న ఏజెన్సీకి విక్రయిస్తారు. ఒక్కో ఐటమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒక్కో ధరకు అమ్ముతారు.

నగరంలో ప్రతిరోజూ 55 మెట్రిక్ టన్నుల నాన్ డిగ్రేడబుల్ లేదా డ్రై వేస్ట్‌తో సహా దాదాపు 110 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇలా 2021 ఆగస్టు నుంచి చెత్తను ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ విక్రయిస్తోంది. ఇలా అమ్మగా వచ్చిన డబ్బులను సిబ్బంది కోసమే ఉపయోగిస్తున్నామని మహంతి చెప్పారు. ఇప్పటివరకు రీసైక్లింగ్ చేయదగిన వ్యర్థాల ద్వారా ఎస్‌ఎంసికి రూ.25 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..