Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lung Health: ఈ పండ్లు మీ ఊపిరితిత్తులకు శ్రీరామ రక్ష.. తప్పక తీసుకోవాలి!

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరం. ముఖ్యంగా శరీరంలో కొన్ని భాగాలు మొత్తం ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అవయవాలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. వాటిల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి. వీటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ కింది పండ్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి..

Lung Health: ఈ పండ్లు మీ ఊపిరితిత్తులకు శ్రీరామ రక్ష.. తప్పక తీసుకోవాలి!
Lung Health
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 08, 2025 | 9:05 PM

మన శరీరంలోని ప్రతి భాగం సరిగ్గా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరం. కాబట్టి మన రోజువారీ ఆహారపు అలవాట్లను కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ కొన్ని సహజ ఆహారాలు తప్పక తీసుకోవాలి. వాటిల్లో పండ్లది సింహభాగం. ముఖ్యం పండ్లలో కొన్ని ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, వాటి పనితీరును మరింత బలోపేతం చేయడానికి బలేగా సహాయపడతాయి. మరి ప్రతిరోజూ ఎలాంటి పండ్లు తీసుకోవాలి? ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

అనాస పండు

ఈ పండులో బ్రోమెలైన్ అనే సహజంగా లభించే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల వాపును నియంత్రిస్తుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని మాంగనీస్ వంటి ఖనిజాలు కణజాలాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పండు తినడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పునరావృతమయ్యే అనారోగ్యాలను నివారించవచ్చు. ఎందుకంటే దీని ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

కివి

ఈ పండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, కివి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.

స్ట్రాబెర్రీ

ఇందులో కణజాలాలను రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను అరికడతాయి.

పుచ్చకాయ

వేసవిలో ఎక్కువగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది ఊపిరితిత్తులకు చాలా మంచిది. ఇందులో ఉండే లైకోపీన్, విటమిన్ సి వంటి పోషకాలు అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో తేమ నిలిచి ఉండి, వాపు తగ్గుతుంది.

మామిడి పండు

మామిడిపండు సాధారణంగా అందరికీ ఇష్టం. ఇందులో బీటా-కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తులను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

దానిమ్మ

ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు ఊపిరితిత్తుల కణాలను బలోపేతం చేస్తాయి. వాతావరణంలోని హానికరమైన వాయువుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అందువల్ల, దానిమ్మ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

నారింజ

ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్లు, బ్యాక్టీరియా నుండి శరీరాన్ని రక్షిస్తుంది. నారింజ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ పండ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..