చారిత్రక కట్టడం చార్మినార్ శిధిలమైపోతుందా ??
హైదరాబాద్ అంటేనే ఎన్నో చారిత్రక కట్టడాలకు, కళారూపాలకు నిలయం. ఎన్నో పురాతన కట్టడాలతో దేశానికే గర్వకారణంగా నిలిచింది హైదరాబాద్. అంతటి వైభవం కలిగిన చారిత్రక కట్టడాలను, కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నగరానికే తలమానికంగా నిలిచిన చార్మినార్ కట్టడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎందరో సందర్శకుల మదిని దోచుకున్న చార్మినార్ కట్టడం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంటోంది. పాతబస్తీలోని ప్రముఖ చార్మినార్ కట్టడంలోని ఒక మినార్ నుంచి పెచ్చులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. నగరంలో గురువారం ఆకస్మికంగా వర్షం ముంచెత్తడంతో తేమ చేరి కట్టడం నుంచి పెచ్చులు ఊడిపడినట్లుగా అనుమానిస్తున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్నవైపు మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో స్థానికంగా విక్రయాలు సాగిస్తున్నవారు, పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఇదే విధంగా గతంలోనూ పెచ్చులు ఊడిపడిన సంఘటనలు చోటు చేసుకోగా అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇంతకు ముందు కూడా ఇలా పెచ్చులు ఊడిపడిన ఘటనలు ఉన్నప్పటికీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించలేదని పలువురు పర్యాటకులు విమర్శిస్తున్నారు. తాజాగా మరోసారి చార్మినార్ పెచ్చులూడటంతో అధికారులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. పెచ్చులు ఊడిపడిన ప్రాంతాన్ని పరిశీలించి మరమ్మత్తులకు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్.. కొత్త అప్‌డేట్ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
TOP 9 ET News: దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది