వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్.. కొత్త అప్‌డేట్ తీసుకొచ్చిన మెటా
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. షార్ట్ టర్మ్‌లోనే ఫేమస్ అయ్యేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. రకరకాల వీడియోలు చేస్తూ అప్‌లోడ్ చేస్తుంటారు. ఇక చాలా మంది మొబైల్ యూజర్స్ ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. వినోదం కోసం రీల్స్ చూసేవారు కొందరయితే, టైంపాస్ కోసం రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేసేవారు మరెందరో మనకు కనపడుతుంటారు.
అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ని చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మధ్యమధ్యలో వాట్సాప్ మెసేజెస్ వస్తుంటాయి. అటువంటప్పుడు ఆ వాట్సాప్ మెసేజ్ చెక్ చేయడం కోసం ఇన్‌స్టాగ్రామ్ లోంచి బయటకు రావడం, ఆ తరువాత మళ్లీ రీల్స్ చూడటం కోసం తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లాల్సి రావడం జరుగుతుంది. ఇది ఎవరికైనా సరే కొంత చికాకు కలిగిస్తుంది. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను నేరుగా వాట్సాప్‌లోనూ చూడవచ్చు. సోషల్ మీడియా యాప్స్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని మెటా వాట్సాప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను చూసేలా కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను చూడటం చాలా సులభం. వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు WhatsApp హోమ్ స్క్రీన్‌లో Meta AI సింబల్‌పై క్లిక్ చేయండి. Meta AI గుర్తుపై క్లిక్ చేసిన తర్వాత చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ చాట్ బాక్స్ కింద, ఒక టెక్స్ట్ ఇన్‌పుట్ బాక్స్ కనిపిస్తుంది. ఇది సాధారణ చాట్ ఇంటర్‌ఫేస్ తరహాలో ఉంటుంది. ఇప్పుడు ఈ చాట్ బాక్స్‌లో ‘షో మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్’ అని టైప్ చేయండి. మీరు సెండ్‌పై క్లిక్ చేసిన వెంటనే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కొన్ని సెకన్లలో మీ స్క్రీన్‌పై కనిపించడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు మీరు రీల్స్‌పై క్లిక్ చేయవచ్చు. మీరు రీల్స్‌పై క్లిక్ చేసిన వెంటనే అది మిమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌కి తీసుకెళుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
TOP 9 ET News: దేవరని వెనక్కి నెట్టి.. చరిత్ర సృష్టించిన పెద్ది
Court OTT: OTTలోకి కోర్టు మూవీ.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్‌ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో

సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంటిలో మొక్కల అద్దె ట్రెండ్
