Andhra: ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో గంజాయిని పట్టుకున్నారు బిక్కవోలు పోలీసులు. వ్యసనాలకు అలవాటు పడి బిక్కవోలు పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని ప్రశ్నించగా.. పోలీసుల ఎంక్వైరీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ లుక్కేయండి.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 21 కేజీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో దొంగిలించిన ఒక బైకును ఇచ్చి 21 కేజీ గంజాయిని నిందితులు తెచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం చెందిన మురుకుర్తి సూర్య ప్రకాష్, అతడి స్నేహితులు ఆవాల మణికంఠ, తోలుమ్ రాజు.. చికెన్ షాపులో పని చేస్తూ అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నారు నిందితులు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు లక్షా ఐదు వేల రూపాయల విలువ ఉంటుందని అంచనా. గంజాయి నేరస్థులకు కఠిన శిక్షలు ఉంటాయని.. గంజాయిని ఎవరు సప్లై చేస్తున్నారో త్వరలోనే కనిపెడతామని పోలీసుల వివరణ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే
