Viral Video: ఛీ ఛీ.. ఎక్కడా ప్లేస్ లేనట్లు మెట్రోలో అడ్డావేశారు.. అందరి ముందే అమ్మాయి, అబ్బాయి ఏం చేశారంటే..?
ఈ మధ్య కాలంలో కొందరు మెట్రోలో డ్యాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే ఈ ఆ మధ్య ఓ అమ్మాయి చాలీచాలని దుస్తులతో మెట్రోలో ప్రయాణించి హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల కాలంలో మెట్రోలో చేయకూడని రచ్చ చేస్తున్నారు కొందరు. పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు మెట్రోలో డ్యాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే ఈ ఆ మధ్య ఓ అమ్మాయి చాలీచాలని దుస్తులతో మెట్రోలో ప్రయాణించి హాట్ టాపిక్ గా మారింది. దాంతో పోలీసులు కూడా గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. పబ్లిక్ ను ఇబ్బంది పెడుతూ.. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఉరుకోము అని తెలిపారు. అయినా కూడా కొందరు ఏవ్ పనులు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ప్రేమ జంట చేసిన పని ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేసింది.
మెట్రో రైలులో ఇద్దరు ప్రేమికులు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వైరల్ గా మారింది. తమను తాము మర్చిపోయి ముద్దుల్లో మునిగిపోయారు ఓ ప్రేమ జంట. వీడియో దాదాపు 1.10 నిమిషాల నిడివి ఉంది. స్థానిక బీజేపీ నాయకుడు వీరేంద్ర తివారీ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 22,000 మందికి పైగా వీక్షించారు.
ఏ పనులు ఎక్కడ చేయాలో మీ పిల్లలకు కొంచెం అయినా నేర్పించండి.. లేకుంటే వారు ఇతరులను తప్పు చేసేలా ప్రోత్సహిస్తారు’ అంటూ వీడియోను షేర్ చేశారు వీరేంద్ర తివారీ. ఇక ఈ వీడియోపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు.
अपने बच्चों को कम से कम इतना तो सिखाएं…कि उन्हें कौन सा काम..कहां करना चाहिए…गन्दगी फैला के रखा हुआ है ऐसे लोगों ने… #दिल्ली_मेट्रो pic.twitter.com/AvCt0efTvl
— VIRENDRA TIWARI (@RealVirendraBJP) April 2, 2023