Viral Video: రాయి తెచ్చిన అదృష్టం.. అదృష్టం అంటే అతనిదే.. వీడియో వైరల్..

Viral Video: రాయి తెచ్చిన అదృష్టం.. అదృష్టం అంటే అతనిదే.. వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Apr 06, 2023 | 9:46 AM

తాజాగా ఓ వ్యక్తి.. ఓ మెటల్ డిటెక్టర్‌తో ఆ ప్రాంతంలో గోల్డ్ కోసం సెర్చింగ్‌ మొదలుపెట్టాడు. అతడిని, అతని చేతిలోని డిటెక్టర్‌ని చూసి చాలామంది ఈ చిన్న డిటెక్టర్‌తో బంగారం పట్టేద్దామనే అంటూ ఎగతాళి చేశారు కూడా..

ఆస్ట్రేలియాలోని బెండిగో-బల్లారత్‌ నగరాల మధ్యన “గోల్డెన్ ట్రయాంగిల్” అనే ప్రాంతం ఉంది. అది బంగారు నిధులకు ప్రసిద్ధి. అక్కడ చాలామందికి బంగారం దొరికిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి.. ఓ మెటల్ డిటెక్టర్‌తో ఆ ప్రాంతంలో గోల్డ్ కోసం సెర్చింగ్‌ మొదలుపెట్టాడు. అతడిని, అతని చేతిలోని డిటెక్టర్‌ని చూసి చాలామంది ఈ చిన్న డిటెక్టర్‌తో బంగారం పట్టేద్దామనే అంటూ ఎగతాళి చేశారు కూడా . అయినా అతడు నిరాశ చెందలేదు. పట్టువదలకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు.అలా వెతుకుతూ ఉండగా.. ఓ రోజు ఓ చోట మెటల్ డిటెక్టర్ నుంచి సౌండ్ వచ్చింది. వెంటనే ఆ ఏరియాలో తవ్వి చూసాడు. సుమారు నాలుగున్నర కేజీల బరువున్న ఓ రాయి కనిపించింది. దాని రంగు చూస్తే అందులో తప్పకుండా బంగారం ఉంటుందని అనిపించింది అతనికి. వెంటనే ఆ రాయిని తీసుకుని.. ఓ బంగారం కొట్టుకు వెళ్లి దాన్ని చెక్‌ చేయించాడు. అతని అన్వేషణ ఫలించింది. ఆ వ్యాపారి బంగారం లాంటి మాట చెప్పాడు. ఆ రాయి ప్యూర్ గోల్డ్. ఆ రాయిలో సుమారు రెండున్నర కిలోల వరకూ బంగారం ఉంటుందని చెప్పాడు. అదే అతనికి కోట్లు తెచ్చిపెట్టింది. డారెన్ క్యాంప్ అనే వ్యక్తి కోటి 30 లక్షల రూపాయలకు దాన్ని కొనుగోలు చేశాడు. ఇలాంటి ఘటనలు చాలా అరుదని ఆ వ్యాపారి తెలిపాడు. ఆ బంగారం దొరికిన వ్యక్తి తన పేరును వెల్లడించానికి ఇష్టపడలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 06, 2023 09:46 AM