Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
అమెరికన్ పారిశ్రామికవేత్త, టెక్ దిగ్గజం స్టీవ్ కిర్చ్ ‘‘ డెల్టా ఫ్లైట్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు తన సహ ప్రయాణికురాలు మాస్క్ ధరించి ఉండటాన్ని గమనించాడు.
కరోనా మహమ్మారి మాస్క్‌ల విలువను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ చిన్న మాస్క్ మనల్ని, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో చూపించింది. కరోనా తగ్గుముఖం పట్టాక చాలామంది మాస్క్‌లు ధరించడం మానేసినా.. కొందరు మాత్రం ఇప్పటికీ మాస్క్ ధరిస్తూనే ఉన్నారు. తాజాగా మన జీవితంలో మాస్క్ ఎంత విలువైందో తెలియజేసే ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. అమెరికన్ పారిశ్రామికవేత్త, టెక్ దిగ్గజం స్టీవ్ కిర్చ్ ‘‘ డెల్టా ఫ్లైట్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు తన సహ ప్రయాణికురాలు మాస్క్ ధరించి ఉండటాన్ని గమనించాడు. ఇంకా మాస్క్ ఎందుకు తీసేసి కంఫర్ట్‌గా ఉండమని ఆమెను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దాంతో.. స్టీవ్ ఆమెతో మాస్క్ ఎలాగైనా తీయించాలి అనుకున్నాడు. అందుకు ఆమెకు భారీగా డబ్బు ఆఫర్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కసారి మాస్క్ తీస్తే ఏకంగా 82 లక్షల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. అయినా ఆ యువతి మాస్క్ తీసేందుకు అంగీకరించలేదు. దాంతో స్టీవ్ షాక్ అయ్యాడు. ఈ విషయాన్ని స్టీవ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఆమె దృఢ నిర్ణయం ముందు తన ఆఫర్లన్నీ విఫలమయ్యాయని చెప్పుకొచ్చాడు. చివరకు ఆహారం తినడానికి ఆమె తన మాస్క్ తీయాల్సి వచ్చిందని, అప్పటి వరకూ ఆమెను ఎంత ఒత్తిడిచేసినా, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తన నిర్ణయం మార్చుకోలేదని స్టీవ్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. దీనిపై ప్రజలు తమ తమ స్పందనలను కామెంట్స్ రూపంలో పేర్కొంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..