Bride – Groom: పెళ్లి వేదికపై వరుడికి అవమానం.. వరుడ్ని చూసి పగలబడి నవ్విన వధువు..
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు... అందుకే ఆ వివాహాన్ని ఎందో సంప్రదాయంగా జరిపేందుకు పెద్దలు ఎన్నో పద్ధతులు పాటిస్తారు. ఆహ్వాన పత్రికల నుంచి విందు భోజనాల వరకూ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు… అందుకే ఆ వివాహాన్ని ఎందో సంప్రదాయంగా జరిపేందుకు పెద్దలు ఎన్నో పద్ధతులు పాటిస్తారు. ఆహ్వాన పత్రికల నుంచి విందు భోజనాల వరకూ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇక పెళ్లంటే పట్టు చీరలు, వరుడికి సూటు, బూటు వగైరా మామూలే.. ఇలా ఎన్ని ఉన్నా.. పెళ్లిలో వరుడికి పంచెకట్టు తప్పనిసరి. ఇక్కడే వరుడికి చిక్కు వచ్చి పడుతుంది. అప్పటివరకూ షార్ట్‌లు, ప్యాంట్లు వేసుకు తిరిగిన అతనికి పంచెకట్టు పెద్ద సమస్యే…పంచె ఎక్కడ జారిపోతుందో అని భయం వెంటాడుతూ ఉంటుంది. ఈ బాధ భరించలేక కొందరు పంచెను పోలిన పైజామాలు ధరిస్తారు. తాజాగా ఓ వరుడకి అలాంటి అనుభవమే ఎదురైంది. వధువు మెడలో వరమాల వేస్తుండగా అతని పైజామా జారిపోయింది. అది చూసి వధువు సిగ్గుతో ముసి ముసిగా నవ్వుకుంటుంది. వధువు అలా నవ్వడం చూసిన వరుడు తన పైజామా జారినట్లు గ్రహించి వెంటనే పైకి లాక్కుని పక్కకు వెళ్లిపోతాడు. అది చూసి వధువు మరింత నవ్వుతుంది. ఈ సంఘటన అంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయిపోయింది.వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

