పోలీసులకు కొత్త సెలవుల్లేవ్‌.. ఇచ్చిన సెలవులు కూడా రద్దు..! కారణం ఇదే..

ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు.  బైశాఖీలో ఏప్రిల్ 14న సిక్కులతో 'సర్బత్ ఖాల్సా' సమావేశం ఏర్పాటు చేయాలని సిక్కు ఉన్నత సంస్థ అకల్ తఖ్త్ చీఫ్‌ను అభ్యర్థించిన వీడియో కొద్ది రోజుల క్రితం వైరల్‌ అయిన సంగతి..

పోలీసులకు కొత్త సెలవుల్లేవ్‌.. ఇచ్చిన సెలవులు కూడా రద్దు..! కారణం ఇదే..
Punjab Police Leave Cancelled
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 07, 2023 | 12:20 PM

ఖలిస్థాన్‌ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు.  బైశాఖీలో ఏప్రిల్ 14న సిక్కులతో ‘సర్బత్ ఖాల్సా’ సమావేశం ఏర్పాటు చేయాలని సిక్కు ఉన్నత సంస్థ అకల్ తఖ్త్ చీఫ్‌ను అభ్యర్థించిన వీడియో కొద్ది రోజుల క్రితం వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. బైసాఖిలో జరిగే సమావేశానికి ముందు అమృత్‌సర్‌లోని అకల్ తఖ్త్ నుండి భటిండాలోని దామ్‌దామా సాహిబ్ వరకు మతపరమైన ఊరేగింపును చేపట్టాలని అతను జఠేదార్‌లను (అకల్ తఖ్త్ ప్రముఖులు) కోరాడు. అప్రమత్తమైన పంజాబ్‌ పోలీస్‌ విభాగం ఏప్రిల్ 14 వరకు పంజాబ్‌ రాష్ట్రంలోని పోలీసులందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఇప్పటికే ఇచ్చిన సెలవులు రద్దు చేయడంతోపాటు, కొత్త సెలవులేమీ మంజూరు చేయొద్దని డీజీపీ ఆయా విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేసింది.

అమృత్‌పాల్ సింగ్ సహాయకుల్లో ఒకరైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను పంజాబ్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తూఫాన్‌ సింగ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా పంజాబ్‌ యువత ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో తూఫాన్‌ సింగ్‌ విడిచిపెట్టవల్సి వచ్చింది. యువతను రెచ్చగొట్టి అల్లర్లకు పురిగొల్పాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్ సింగ్‌పై కేసునమోదైంది. పోలీసులు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన తర్వాత అనూహ్యంగా తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతన్ని పట్టుకునేందుకు పోలీసుల వేట కొనసాగుతోంది. కాగా ‘సర్బత్ ఖల్సా’ సమావేశం పంజాబ్‌లో రెండు సార్లు మాత్రమే జరిగింది. 1986లో తొలిసారి జరగగా, చివరిగా 2015లో జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.