Green Tea: ఇలాంటి వారు గ్రీన్ టీ తాగితే పెను ప్రమాదమే.. తెలుసుకుంటే మీకే మంచిది..
గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందుకే.. గ్రీన్ టీ తాగాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. గ్రీన్ టీలో విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
Updated on: Apr 09, 2023 | 11:22 AM

గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అందుకే.. గ్రీన్ టీ తాగాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. గ్రీన్ టీలో విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

ఇన్ని పోషకాలున్నా.. గ్రీన్ టీ కొంతమందికి హాని కలిగిస్తుందంటున్నారు. కొందరు పొరపాటున కూడా గ్రీన్ టీని తాగకూడదని సూచిస్తున్నారు. ఎలాంటి వ్యక్తులు గ్రీన్ టీ తాగకూడదు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భిణులు: గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీ తాగడం మానుకోవాలి. ఎందుకంటే గ్రీన్ టీలో ఉండే కాటెచిన్ సమ్మేళనం గర్భధారణలో ఆందోళనను పెంచుతుంది. ఇంకా ఇది పిల్లలకి హానికరం. అందుకే గర్భిణీలు గ్రీన్ టీ తాగకూడదు.

కంటిశుక్లం రోగులు: గ్రీన్ టీ కళ్లకు కూడా హానికరం. గ్రీన్ టీ తాగడం కంటిశుక్లం రోగులకు హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కంటిశుక్లం రోగులు గ్రీన్ టీ తాగినప్పుడు, కళ్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది క్రమంగా హానికరంగా మారుతుంది.

పేలవమైన జీర్ణక్రియ ఉన్నవారు: బలహీనమైన జీర్ణక్రియ ఉన్నవారికి గ్రీన్ టీ తాగడం చాలా హానికరం. ఇందులో ఉండే టానిన్ అనే మూలకం కడుపులో యాసిడ్‌ను పెంచడానికి పని చేస్తుంది. దీని కారణంగా ఇది అపానవాయువుకు కారణమవుతుంది.

రక్తహీనత రోగులు: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను సరిగా గ్రహించదు. అటువంటి పరిస్థితిలో రక్తహీనత ఉన్న రోగి గ్రీన్ టీ తాగకుండా ఉండాలి.