- Telugu News Photo Gallery Cinema photos Arrest warrant for heroine Ameesha Patel in check bounce case
Ameesha Patel: అందాల భామకు అరెస్ట్ వారెంట్.. అసలు విషయం ఏంటంటే
అందం అభినయం ఉన్న అమీషా బాలీవుడ్ లో చాలా కాలం రాణించింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితురాలే.
Updated on: Apr 09, 2023 | 10:15 AM

అమీషా పటేల్.. ఒకప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. చూడచక్కని రూపంతో ఈ చిన్నది ప్రేక్షకులను కట్టిపడేసింది

అందం అభినయం ఉన్న అమీషా బాలీవుడ్ లో చాలా కాలం రాణించింది. అలాగే తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితురాలే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగులో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నాని సినిమాలో హీరోయిన్ గా చేసింది.

అలాగే తారక్ తో కూడా ఓ సినిమాలో నటించి మెప్పించింది అమీషా. ఆ తర్వాత ఈ చిన్నది తెలుగులో సినిమాలు చేయలేదు. బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ అయ్యింది.

ఇక ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ అరాచకం సృష్టిస్తోంది. లేదు వయసులోనూ ఘాటు అందాలతో మతిపోగుడుతోంది. రోజూ హాట్ హాట్ ఫోటోలు వీడియోలతో అమీషా అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడి పై అరెస్ట్ వారెంట్ ఇషూ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఈ అమ్మడి పై కేసు నమోదు అయ్యింది. 2018వ సంవత్సరంలో అమీషా పటేల్.. వ్యాపార భాగస్వామి కునాల్‌పై అజయ్ కుమార్ సింగ్ అనే నిర్మాత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కునాల్ పై చీటింగ్, బ్లాక్ మెయిలింగ్, చెక్ బౌన్స్ వంటి కేసులు పెట్టారు. అయితే అమీషా పటేల్ లేదా ఆమె తరుపు లాయర్.. విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో అమీషా పటేల్, కునాల్ వంటి వారికి రాంచీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.





























