AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నవ వధువు వినూత్న ఆలోచన .. మెహందీతో తమ పరిచయం, ప్రేమ, వివాహం గురించి చెప్పిన పెళ్లికూతురు

ఈ వీడియోలో ఓ నవ వధువు చేతిలో మెహిందీ పెట్టించుకుంటోంది. ఇందులో విచిత్రమేముంది అనుకోకండి. అందులోనే ఉంది అంతా.. ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తనకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వారిమధ్య ప్రేమ చిగురించింది.

Viral Video: నవ వధువు వినూత్న ఆలోచన .. మెహందీతో తమ పరిచయం, ప్రేమ, వివాహం గురించి చెప్పిన పెళ్లికూతురు
Mehandi Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2023 | 1:37 PM

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అందుకే వివాహ బంధం నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షింస్తూ పెళ్లికి ముందు మెహిందీ ఫంక్షన్‌, హల్దీ ఫంక్షన్‌ వారి వారి సంప్రదాయాను అనుసరించి రకరకాల వేడుకలు నిర్వహిస్తారు. తాజాగా ఓ వధువు తన ప్రేమ వివాహాన్ని గురించి తన చేతిలోని మెహిందీ ద్వారా తెలిపింది. వధువు ఈ వినూత్న ఆలోచన ద్వారా తన వివాహఘట్టాన్ని మరింత మధురంగా మలచుకుంది. వధువు ఆలోచనకు బంధువులే కాదు నెటిజన్లు సైతం ఎంతగానో మెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ వధువు ఏం చేసిందంటే..

ఈ వీడియోలో ఓ నవ వధువు చేతిలో మెహిందీ పెట్టించుకుంటోంది. ఇందులో విచిత్రమేముంది అనుకోకండి. అందులోనే ఉంది అంతా.. ఆమె వివాహం చేసుకోబోయే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తనకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వారిమధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వారి ప్రేమ పెళ్లి పీటలెక్కింది. అదే విషయాన్ని వధువు తన చేతిలోని గోరింటాకు ద్వారా చెప్పింది. వరుడు తనకు 2021 డిసెంబర్‌ 5న ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడట, 2022 జనవరి 19న తనను వివాహం చేసుకోవాలని ప్రపోజ్‌ చేశాడట.

ఇవి కూడా చదవండి

2022, ఏప్రిల్‌ 25న వారు మొదటిసారి కలిసి మాట్లాడుకుని, పరస్పరం అంగీకారం తెలుపుకున్నారట. ఇక 2023 జనవరి 31న ఇరుపక్షాల బంధుమిత్రలు సమక్షంలో వివాహం చేసుకుంటున్నట్లు ఆయా తేదీలను తన చేతిలో మెహిందీ డిజైన్‌గా వేసుకుంది. ఈ వీడియోను మిలియన్‌ మందికి పైగా వీక్షించడమే కాదు అదే సంఖ్యలో లైక్‌ చేశారు. 4 వేలమందికి పైగా తమదైన శైలిలో కామెంట్లు కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..