Swiggy: స్విగ్గీ నిర్వాకం.. ‘వెజ్ బిర్యానీలో చికెన్‌ ముక్క’ ఇదేం తొలిసారి కాదంటూ మండిపడుతున్న నెటిజన్లు

స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్‌ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. వెజ్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. దానిలో మాంసం ముక్క రావడం చూసి షాక్‌కు గురైంది. వెజిటేరియన్‌ అయిన తాను వెజిటబుల్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే నాన్‌ వెజ్ బిర్యానీ ఎలా డెలివరీ చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. స్వీగ్గీ నిర్వాకంపై యాజమన్యానికి ఫిర్యాదు చేస్తే వారి స్పందన..

Swiggy: స్విగ్గీ నిర్వాకం.. 'వెజ్ బిర్యానీలో చికెన్‌ ముక్క' ఇదేం తొలిసారి కాదంటూ మండిపడుతున్న నెటిజన్లు
Swiggy
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 12, 2023 | 3:45 PM

స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్‌ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. వెజ్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే.. దానిలో మాంసం ముక్క రావడం చూసి షాక్‌కు గురైంది. వెజిటేరియన్‌ అయిన తాను వెజిటబుల్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే నాన్‌ వెజ్ బిర్యానీ ఎలా డెలివరీ చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. స్వీగ్గీ నిర్వాకంపై యాజమన్యానికి ఫిర్యాదు చేస్తే వారి స్పందన మరో విధంగా ఉంది. వివరాల్లోకెళ్తే..

నటాషా భరద్వాజ్ అనే మహిళ మంగళవారం స్విగ్గీలో వెజ్ బిర్యానీని ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలివరీ చేశాక పార్శిల్‌ విప్పి తింటుండగా.. దానిలో ఊహించని విధంగా చికెన్‌ పీస్‌ ప్రత్యక్షమైంది. దీంతో బిర్యానీలో చికెన్‌ ముక్కతోపాటు తాను ఆర్డర్ చేసిన బిల్లును ఫొటోలు తీసి ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆ పోస్ట్‌లో ‘ఎవరికైనా శాఖాహారులు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. నేను వెజిటేరియన్‌ రెస్టారెంట్‌లో వెజ్‌ బిర్యానీ ఆర్డర్ చేసాను. కానీ వారు డెలివరీ చేసిన వెజ్‌ బిర్యానీలో మాంసం ముక్క ఉంది. ఇటువంటి మిస్టేక్‌లు ఆమోదయోగ్యం కాదని’ ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టింది. దీనిపై స్విగ్గీ ఎగ్జిక్యూటివ్‌కి ఫిర్యాదు చేస్తే అసలు వారికి ఏమాత్రం తప్పు చేశామనే బాధకూడా లేదని నటాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నటాషా ట్వీట్‌కు స్విగ్గీ బదులిస్తూ.. అది నాన్-వెజిటేరియన్ రెస్టారెంట్ అని, ఐతే స్విగ్గీలో మాత్రం వెజిటేరియన్‌ రెస్టారెంట్‌గా ఎందుకు పేర్కొన్నారో తనకు తెలియదని అంటున్నారు. దీనికి సంబంధించి సంబంధిత రెస్టారెంట్‌ను వివరణ కోరుతామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కానియ్యమని హామీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతుం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఫుడ్ డెలివరీ చేయడంలో ఇలాంటి పొరపాట్లు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి చేదు అనుభవాలు తామకూ ఎదురయ్యాయంటూ పలువురు నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్