Oscar Fish: వేటగాళ్ల వలకు చిక్కిన ఆరుదైన చేప.. అక్కడి జలపుష్పాలను ఎగబడి కొంటోన్న జనాలు

ఉలస, పులస, బొమ్మిడాయిలు, బుడ్డ పక్కిల, కొర్రమీను, గడ్డిమూస, బంగారు తీగ, వంజరం.. ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల చేపలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అరణియార్‌ జలాశయం ఫేమస్‌. ఇక్కడ సహజవాతావరణంలో పెరిగే చేపలు ఆహారప్రియులను అమితంగా ఆకర్షిస్తాయి. ఏడాది పొడవునా సమృద్ధిగా..

Oscar Fish: వేటగాళ్ల వలకు చిక్కిన ఆరుదైన చేప.. అక్కడి జలపుష్పాలను ఎగబడి కొంటోన్న జనాలు
Oscar Jilebi Fish
Follow us

|

Updated on: Apr 11, 2023 | 3:46 PM

ఉలస, పులస, బొమ్మిడాయిలు, బుడ్డ పక్కిల, కొర్రమీను, గడ్డిమూస, బంగారు తీగ, వంజరం.. ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల చేపలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అరణియార్‌ జలాశయం ఫేమస్‌. ఇక్కడ సహజవాతావరణంలో పెరిగే చేపలు ఆహారప్రియులను అమితంగా ఆకర్షిస్తాయి. ఏడాది పొడవునా సమృద్ధిగా నీరు నిల్వ ఉండడంతో మత్స్యకారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నదిలో 50 గ్రాముల నుంచి 50 కిలోల బరువు చేప కూడా జీవిస్తుందని జాలరులు అంటున్నారు. 0.25 కేజీ సైజుతో రొయ్యలు కూడా దొరుకుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాల కారణంగా కొత్తనీరు చేరడంతోపాటు అరుదైన చేపలు జలాశయంలోకి వచ్చిచేరాయి. వీటిల్లో ఆస్కార్‌ మీనం పసుపు, బంగారు వర్ణంలో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రిజర్వాయర్‌లోకి వరద వచ్చినప్పుడు మత్స్యకారులకు భారీ చేపలు పడుతుంటాయి. ఈ క్రమంలోనే అరణియార్‌ ప్రాజెక్టులో సోమవారం జాలర్ల వలకు ఆస్కర్‌ జిలేబీ అనే చిక్కింది. పిచ్చాటూరు ఎస్టీ కాలనీకి చెందిన మారయ్య విసిరిన వలలో ఈ చేప పడింది. వందల కుటుంబాలకు జీవనోపాధి ఇచ్చే ఈ ప్రాజెక్టులో అప్పుడప్పుడు ఇలాంటి చేపలు జాలర్లకు చిక్కుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు సమీపంలోని శేషంపేటలో శేఖర్‌ అనే రైతు గత ఏడాది కలర్‌ చేప పెంపంకం చేపట్టాడని.. ఐతే నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు శేఖర్‌ చేపల గుంట మునిగిపోవడంతో అందులోని చేపలు కొన్ని అరణియార్‌ జలాశయంలోకి చేరాయని మత్స్యశాఖ అధికారి నరేంద్రబాబు తెలిపారు. అవే అప్పుడప్పుడు జాలర్లకు చిక్కుతున్నట్లు ఆయన తెలిపారు. అరణియార్‌ చేపల రుచికి చేపల ప్రియులు ముగ్ధులవుతుంటారు. నీరు తగ్గిపోతున్నప్పుడు జలాశయం తీరంలోని గుంతల్లో కొర్రమీనులు లభిస్తుంటాయి. వీటిని కిలో రూ.200 నుంచి రూ.400 వరకు విక్రయిస్తుంటారు. మిగతా చేపలు కిలో రూ.100 నుంచి రూ.150కే ఆహార ప్రియులకు విక్రయిస్తుంటారు. జాలర్లు చేపలను ఒడ్డుకు తీసుకురాగానే జనం ఎగబడి మరీ క్షణాల్లో కొనుక్కువెళ్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!