AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు

అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో విధిగా స్వచ్ఛ తాగునీటిని ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం (ఏప్రిల్ 10) ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు..

Hyderabad: హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు
Govt Orders To All Hotels And Restaurants
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 10, 2023 | 7:30 PM

అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో విధిగా స్వచ్ఛ తాగునీటిని ఉచితంగా అందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం (ఏప్రిల్ 10) ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పని సరిగా జలమండలి సరఫరా చేసే తాగు నీటిని గానీ, ఆర్ఓ వాటర్, శుద్ధి చేసిన నీటిని గానీ తప్పని సరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ కమీషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఒకవేళ హోటళ్లు, రెస్టారెంట్లలో తప్పని సరి పరిస్థితుల్లో వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తే ఆయా బాటిల్స్‌పై ముద్రించిన గరిష్ట ధరను మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కాగా నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో వేరు వేరు బ్రాండ్ల పేరుతో వాటర్‌ బాటిల్లను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై అర్వింద్ కుమార్ స్పందిస్తూ ఈ మేరక ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.