Viral Video: పెళ్లింట సరదాగా చేసిన పనికి వధువుపై కేసు నమోదు.. పోలీసుల ఎంట్రీతో పరుగో పరుగు
పెళ్లంటే పచ్చని పందిళ్లు, బంధువులు, విందు భోజనాలు.. వంటివి సాధారణం. ఇంకొంచెం ముందుకు వెళ్తే.. బరాత్‌లు, ప్రీవెడ్డింగ్ షూట్‌లు, బారీ ఎత్తున బాణా సంచాలు కాల్చడం వంటివి షరా మామూలే. దేశంలో ఏ ప్రాంతంలోనైనా దాదాపు అన్ని పెళ్లిళ్లు ఇలాగే జరుగుతుంటాయి. ఐతే ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పెళ్లి మాత్రం భిన్నం జరిపించారు. సరదా కోసం చేసిన పని వధువును..
పెళ్లంటే పచ్చని పందిళ్లు, బంధువులు, విందు భోజనాలు.. వంటివి సాధారణం. ఇంకొంచెం ముందుకు వెళ్తే.. బరాత్‌లు, ప్రీవెడ్డింగ్ షూట్‌లు, బారీ ఎత్తున బాణా సంచాలు కాల్చడం వంటివి షరా మామూలే. దేశంలో ఏ ప్రాంతంలోనైనా దాదాపు అన్ని పెళ్లిళ్లు ఇలాగే జరుగుతుంటాయి. ఐతే ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పెళ్లి మాత్రం భిన్నం జరిపించారు. సరదా కోసం చేసిన పని వధువును కటకటాల వెనక్కి పంపింది. అంత వింతగా ఏం చేసిందో మీరే చూడండి..
ఉత్తరప్రదేశ్‌లోని సేలంపూర్‌లో మార్చి 7వ తేదీన (శుక్రవారం) ఓ వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. వేధికపై వధువు, వరుడు కూర్చుని అతిధుల ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇంతవరకు ఎక్కడైనా జరిగేదే. ఐతే ఈ పెళ్లిలో మాత్రం వేధికపై వరుడి పక్కన కూర్చున్న వధువుకి రివాల్వర్‌ని ఫుల్‌గా లోడ్ చేసి ఓ వ్యక్తి అందిస్తాడు. ఆ తర్వాత వధువు రివాల్వర్‌ని ఎత్తిపట్టి గాల్లో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపడం వీడియోలో కనిపిస్తుంది. పాపం పక్కనే ఉన్న వరుడు మాత్రం బిక్కసచ్చినట్లు ఉలుకూపలుకూ లేకుండా మౌనంగా కూర్చుని ఉండటం వీడియోలో చూడొచ్చు. వాళ్ల ఆచారమో.. లేక వెరైటీగా ఉంటుందని చేశారో తెలీదుగానీ ప్రస్తుతం ఈ వింత పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో అదికాస్తా పోలీసుల కంట పడింది.
Hathras, U.P., 2023#WomenEmpowerment #ABLANARI
Are Indians without a gun licence allowed to use guns @Uppolice @kpmaurya1 @myogiadityanath @dgpup @hathraspolice @dm_hathras ⁉️
Please investigate such incidents@NCMIndiaa @realsiff @Das1Tribikram @RajNgc @KirenRijiju pic.twitter.com/UFgJRgowWT
— Lady Of Equality ?? (@ladyofequality) April 9, 2023
అంతే సదరు వధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నవ వధువు, ఆమెకు తుపాకీ అందించిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ఎవరైనా మానవ ప్రాణాలకు లేదా ఇతరుల భద్రతకు హాని కలిగించే విధంగా నిర్లక్ష్యంగా తుపాకీని వినియోగిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా లక్ష జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండింటిని కూడా శిక్షగా విధించే అవకాశం ఉంది. హత్రాస్‌లోని సేలంపూర్ ప్రాంతంలోని అతిథి గృహంలో వివాహ సంబరాల్లో భాగంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.