Nayanthara: మంచి మనసు చాటుకొన్న నయన్‌ దంపతులు.. ‘మనిషిమాత్రమే కాదు మనసూ అందమే’ అంటోన్న నెటిజన్లు

లేడీ సూపర్ స్టార్‌ నయనతార, ఆమె భర్త విష్నేష్‌ శివన్‌ దంపతులు మంచి మనసు చాటుకున్నారు. వర్షంలో నిరాశ్రయులైన పేదలకు ఆహారం, ఇతర వస్తువులు అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియోలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో..

Nayanthara: మంచి మనసు చాటుకొన్న నయన్‌ దంపతులు.. 'మనిషిమాత్రమే కాదు మనసూ అందమే' అంటోన్న నెటిజన్లు
Nayanthara and Vignesh Shivan
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2023 | 12:51 PM

లేడీ సూపర్ స్టార్‌ నయనతార, ఆమె భర్త విష్నేష్‌ శివన్‌ దంపతులు మంచి మనసు చాటుకున్నారు. వర్షంలో నిరాశ్రయులైన పేదలకు ఆహారం, ఇతర వస్తువులు అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియోలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతోన్న విషయం తెలిసిందే. జీవనోపాధి లేక, ఉండటానికి సరైన ఇళ్లు లేక రోడ్లపైనే జీవించే నిరాశ్రయులైన నిరుపేదలకు తమ వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. నయన్‌ తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి శుక్రవారం (ఏప్రిల్‌ 7) రాత్రి వర్షంలోనే నిరాశ్రయులకు భోజనం పొట్లాలు అందించారు. నయన్‌ దంపతుల గొప్ప మనసును నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. నయన్‌ సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ న్యూ ఇయర్‌ వేడుకలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి నెలలో ఆమె పలువురు పేదలకు గిఫ్ట్‌ బాక్సులు అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘చెన్నై నగర వీధుల్లో నిద్రిస్తోన్న నిరాశ్రయులైన పేదలకు లేడీ సూపర్ స్టార్ చేసిన సాయం ఆమె గొప్ప మనసును చాటుతోంది’, ‘నయన్‌ అందచందాల్లోనేకాదు మనసు కూడా ఎంతో ఉన్నతమైనది’ అంటూ పలువురు అభిమానులు కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అధికమంది నెటిజన్లు ‘తలైవి’ అంటూ నయన్‌ను పిలవడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార ప్రస్తుతం షారుఖ్‌తో కలిసి ‘జవాన్‌’లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి అరంగెట్రం చేయనున్న విషయం తెలిసిందే. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మువీలో ప్రియమణి, సన్యా మల్హోత్రా, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 2న విడుదల చేసేందుకు చిత్రం బృందం సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..