AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Aaryan: ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి కార్తీక్ ఆర్యన్ తప్పుకున్నాడా..? అసలు విషయం ఏంటంటే

భూల్‌ భులయ్యా 2 సక్సెస్‌ తరువాత బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ రేంజే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ స్టార్ అన్నట్టుగా ఉన్న కార్తీక్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ లీగ్‌లోకి ఎంటర్‌ అయ్యారు.

Kartik Aaryan: ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి కార్తీక్ ఆర్యన్ తప్పుకున్నాడా..? అసలు విషయం ఏంటంటే
Kartik Aaryan
Rajeev Rayala
|

Updated on: Apr 09, 2023 | 12:49 PM

Share

బాలీవుడ్ నయా సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ హీరోగా మరో బిగ్ మూవీ ఎనౌన్స్ అయ్యింది. బ్లాక్ బస్టర్ రొమాంటిక్ సిరీస్‌ ఆషికీ ఫ్రాంచైజీలో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ను సిద్ధం చేస్తున్నారన్న న్యూస్‌ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి కార్తిక్ తప్పుకున్నారన్నది సోషల్ మీడియాలో నయా ట్రెండింగ్ టాపిక్‌.. భూల్‌ భులయ్యా 2 సక్సెస్‌ తరువాత బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ రేంజే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ స్టార్ అన్నట్టుగా ఉన్న కార్తీక్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ లీగ్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఆ తరువాత కూడా ఫ్రెడ్డీ, షెహజాదా సినిమాలతో మంచి వసూళ్లు సాధించటంతో కార్తిక్ ఫ్యూచన్‌ ప్రాజెక్ట్ మీద క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.

కార్తీక్ ఆర్యన్‌ హీరోగా టీ సిరీస్‌తో కలిసి ఆషికీ 3 సినిమాను నిర్మిస్తున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు మహేష్ భట్‌. సెన్సేషన్ క్రియేట్ చేసిన రొమాంటిక్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ కావటంతో ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ తాజాగా ఈ సినిమా నుంచి కార్తీక్ ఆర్యన్ తప్పుకున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో ఈ వార్తలపై చిత్రయూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఆషికీ తొలి భాగంలో రాహుల్‌ రాయ్‌, అను అగర్వాల్ జంటగా నటించారు. పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా.. ఈ సినిమా మ్యూజికల్‌గా బిగ్ హిట్ అయ్యింది. ఆదిత్య రాయ్‌ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా తెరకెక్కిన ఆషికీ 2 సెన్సేషన్ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా మ్యూజికల్‌గానే కాదు కమర్షియల్‌గానూ సంచనాలు నమోదు చేయటంతో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

ఇంత క్రేజ్‌ ఉన్న ప్రాజెక్ట్ నుంచి కార్తిక్‌ అసలు ఎందుకు తప్పుకుంటారు? ఈ ఏడాదిలోనే ఆషికీ 3 సెట్స్ మీదకు వెళుతుంది అది కూడా కార్తిక్‌ హీరోగానే అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అనురాగ్‌ బసు. ఈ ఎనౌన్స్‌మెంట్ తో మరో క్లాసిక్‌ హిట్ ఆన్‌ కార్డ్స్‌ అంటున్నారు ఈ యంగ్ హీరో ఫ్యాన్స్‌. కార్తిక్ ఆర్యన్ హీరోగా సీక్వెల్ ఉంటుందన్న క్లారిటీ రావటంతో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆషిఖీ 2లో నటించిన శ్రద్దా కపూర్ మరోసారి హీరోయిన్‌గా నటిస్తారన్న టాక్ ఓ వైపు వినిపిస్తోంది. అదే సమయంలో బాలీవుడ్ లక్కీ గర్ల్‌ కృతిసనన్‌, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో చిత్రయూనిట్ ఆలోచన ఎలా ఉంది. ఎవరి పేరు ఫైనల్ చేస్తారు అన్న విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..