- Telugu News Photo Gallery Cinema photos Amid Breakup Rumors, Niharika Konidela deleted everything except that one photo
Niharika Konidela: ‘ష్.. సీక్రెట్’ ఆ ఒక్కటి తప్ప.. మిగతా అన్ని ఫొటోలు డిలీట్ చేసిన మెగా డాటర్ నిహారిక
ఇటీవల కాలంలో సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తున్నాయి. ఇదే పందాలో మెగా డాటర్ నిహారిక దంపతులు కూడా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. 2020 డిసెంబర్ 9న చైతన్య, నిహారికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట సోషల్ మీడియాలో సైలెంట్ అవ్వడంతో అనుమానం రేకెత్తింది. నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని.. విడాకులు కూడా..
Updated on: Apr 10, 2023 | 3:17 PM

ఇటీవల కాలంలో సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తున్నాయి. ఇదే పందాలో మెగా డాటర్ నిహారిక దంపతులు కూడా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. 2020 డిసెంబర్ 9న చైతన్య, నిహారికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట సోషల్ మీడియాలో సైలెంట్ అవ్వడంతో అనుమానం రేకెత్తింది. నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని.. విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా నెట్టింట వార్తలు జోరందుకున్నాయి.

అందుకు కారణం లేకపోలేదు. తొలుత నిహారిక భర్త చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి గత నెలలో తమ పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.

ఇక తాజాగా నిహారిక కూడా తన ఇన్‌స్టా ఖాతా నుంచి పెళ్లి ఫోటోలు, చైతన్యతో కలిసి దిగిన పిక్స్ డిలీట్ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతం చేకూరినట్లైంది. ఐతే అన్ని ఫోటోలు తొలగించిన నిహారిక ఒక్క ఫొటో మాత్రం అలాగే ఉంచేసింది.

పెళ్లి మండపంలో చైతన్య పక్కనే కూర్చుని ష్.. అంటూ వేలు పెదాలపై ఉంచిన ఫొటో అది. 'నా దగ్గర ఓ సీక్రెట్ ఉంది. కానీ అది మీకు చెప్పేస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది? సారీయే, ఓన్లీ జోసెఫ్‌రాదిక్‌కి మాత్రమే ఆ సీక్రెట్ తీలుసు' అనే క్యాప్షన్‌తో ఆ ఫొటోను షేర్ చేసింది. నిహారిక తన పెళ్లిలో చైతన్య లేకుండా ఉన్న ఫ్యామిలీ ఫోటోలను కూడా అలాగే ఉంచేసింది.

నిహారిక తాజా పోస్టుకు నెటిజన్లు భిన్న స్పందనలు తెలుపుతున్నారు. ఆ ఒక్క ఫోటో మాత్రం ఎందుకు అలాగే ఉంచేశావ్? మర్చిపోయి ఉంచేశావా ఏంటి అని ఆరా తీస్తున్నారు.





























