Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Billionaires as Slumdog : ‘బికారులైన ప్రపంచ అపర కుబేరులు’ ఇది కలా..? నిజమా..? తెలియక తికమకపడుతోన్న నెటిజన్లు

కాలం కన్నెర్ర జేస్తే ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయనే సామెత వినే వుంటారు. ఏమో ఎవరికి ఎరుక.. ఎవరి బతుకు ఏ క్షణాన ఏమౌతుందో. ఒకవేళ నిజంగా ఆ పరిస్థితే ఎదురైతే మనం ఎలా ఉండబోతామో ముందుగా తెలుసుకునే ఛాన్స్‌ ఉందా? టెక్నాలజీ పుణ్యమా అని అదీ సాధ్యమేనని తేలిపోయింది. ప్రపంచ అపర కుబేరులు..

Billionaires as Slumdog : 'బికారులైన ప్రపంచ అపర కుబేరులు' ఇది కలా..? నిజమా..? తెలియక తికమకపడుతోన్న నెటిజన్లు
world's wealthiest people as poor
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 10, 2023 | 4:15 PM

కాలం కన్నెర్ర జేస్తే ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయనే సామెత వినే వుంటారు. ఏమో ఎవరికి ఎరుక.. ఎవరి బతుకు ఏ క్షణాన ఏమౌతుందో. ఒకవేళ నిజంగా ఆ పరిస్థితే ఎదురైతే మనం ఎలా ఉండబోతామో ముందుగా తెలుసుకునే ఛాన్స్‌ ఉందా? టెక్నాలజీ పుణ్యమా అని అదీ సాధ్యమేనని తేలిపోయింది. ప్రపంచ అపర కుబేరులు జెఫ్ బెజోస్ నుంచి ఎలోన్ మస్క్ వరకు అందరూ మాసిపోయిన బట్టల్లో స్లమ్‌ ఏరియాల్లో నివసిస్తున్నట్లు దీనంగా కనిపిస్తోన్న ఈ ఫొటోలను చూశారా? ఇదంతా ఏంటి.. ఏం జరుగుతోంది? అని తికమక పడిపోతున్నారా? మరేంలేదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మిడ్‌జర్నీ వంటి యాప్‌ల ద్వారా పండు ముసలిని పసి పిల్లాడిలా, వీధిలో అడుక్కునే బికారి ధనవంతుడిగా మారితే ఎలా ఉంటుందో చిటికెలో క్రియేటివ్‌ ఇమేజ్‌లను సృష్టించగలవు. అలాంటి సృష్టే ఇది కూడా.

ఏఐ ఆర్ట్ ద్వారా ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు పేద‌వారైతే ఎలా ఉంటార‌ని ఊహిస్తూ గోకుల్ పిళ్లై అనే ఆర్టిస్ట్ ఈ ఇమేజ్‌లను రూపొందించాడు. మిడ్‌జౌనీ అనే యాప్‌ ద్వారా తన ఊహలకు ప్రాణం పోశాడు. డోనాల్డ్‌ ట్రంప్‌, బిల్‌ గేట్స్‌, ముకేష్ అంబానీ, మార్క్‌ జుకర్‌ బర్గ్, వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్‌ల వంటి బిలియనీర్ల ఫొటోలను గోకుల్ పిళ్లై తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్స్ (ఈ జాబితాలో ఇంకెవరినైనా చేర్చడం మర్చిపోయానా?)’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల‌వుతున్నాయి.  ఏమాటకామాట చెప్పుకోవాలి.. ఎలన్‌ మస్క్‌ మాత్రం పేద వాడి గెటప్‌లోనూ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  మీరూ ఓ లుక్కేసుకోండి..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Gokul Pillai (@withgokul)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!