PM Kisan Scheme: భార్యాభర్తలిద్దరికీ పట్టా పాస్‌బుక్‌లు ఉంటే పీఎం కిసాన్ సాయం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దేశ ప్రజల కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. రైతులు లబ్ది చేకూర్చే పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్..
దేశ ప్రజల కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. రైతులు లబ్ది చేకూర్చే పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులు ఏడాదికి రూ.6000 అందుకుంటున్నారు. ఈ మొత్తం మూడు విడతల్లో రూ.2000 చొప్పున మోడీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 9 కోట్ల మంది రైతులు లబ్దిపొందుతున్నారు. ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2000 చొప్పున కేంద్ర రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు 13వ విడత డబ్బులు అందగా, ఇప్పుడు 14వ విడత త్వరలో రానుంది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ పథకంపై ఓ ప్రచారం జరుగుతోంది. అలాంటి ప్రచారానికి కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
అదేంటంటే.. పీఎం కిసాన్ పథకం కింద ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా వర్తిస్తుందంటూ సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, భార్యాభర్తలిద్దరికి వర్తించదని తేల్చి చెప్పింది. అయితే భార్యాభర్తలు ఇద్దరికీ భూము ఉన్నట్లు వేర్వేరు పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ.. ఒకరికి మాత్రమే ఈ పథకం సాయం అందుతుందని తెలిపింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే పీఎం కిసాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే రైతులు భూ రికార్డులను సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ -కేవైసీ చేయడం తప్పనిసరి. ఆ తరువాత రైతులు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి తమ పేరును నమోదు చేసుకోవాలి. ఇందులో పాన్, ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు కేవైసీ పూర్తి చేయకపోతే ఈ పథకం ప్రయోజనం అందదని గుర్తించుకోవాలి. కేవైసీ పూర్తి చేసుకోవాలంటే ఇంట్లోనే ఇండి ఆన్‌లైన్ లేదా మీ సేవ కేంద్రాలకు వెళ్లి కూడా పూర్తి చేసుకోవచ్చు. అయితే కేవైసీ పూర్తి చేయని రైతులకు డబ్బులు అందించమని కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి