Gold Import: దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు.. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు విడుదల

గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-ఫిబ్రవరి, 2023) మొదటి 11 నెలల్లో దేశంలో బంగారం దిగుమతి దాదాపు 30 శాతం తగ్గి 31.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తె లిపింది. విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అధిక..

Gold Import: దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు.. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు విడుదల
ప్రపంచంలో నాలుగో స్థానం.. బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం ఒకటి. 2022లో, భారతదేశం 31.25 టన్నులను దిగుమతి చేసుకొని ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో నిలిచిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక స్పష్టం చేసింది.
Follow us
Subhash Goud

|

Updated on: Apr 09, 2023 | 6:38 PM

గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-ఫిబ్రవరి, 2023) మొదటి 11 నెలల్లో దేశంలో బంగారం దిగుమతి దాదాపు 30 శాతం తగ్గి 31.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తె లిపింది. విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అధిక కస్టమ్స్ డ్యూటీ రేట్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య బంగారం దిగుమతులు తగ్గాయి. బంగారం దిగుమతి దేశ కరెంట్ ఖాతా లోటు (సిఎడి)పై ప్రభావం చూపడం గమనార్హం.

2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో గోల్డెన్ మెటల్ దిగుమతి 45.2 బిలియన్ డాలర్లు. ఆగస్టు 2022 నుంచి బంగారం దిగుమతులు ప్రతికూలంగా ఉన్నాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో వెండి దిగుమతులు 66 శాతం పెరిగి 5.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ, దేశ వాణిజ్య లోటును తగ్గించడంలో ఇది సాయపడలేదు. దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసాన్ని వాణిజ్య లోటు అంటారు. ఏప్రిల్-ఫిబ్రవరి, 2022-23లో వాణిజ్య లోటు $247.52 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 172.53 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

బంగారం దిగుమతులు ఎందుకు తగ్గాయి

పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారంపై అధిక దిగుమతి సుంకం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు దాని దిగుమతుల్లో క్షీణతకు దారితీశాయి. పరిమాణం పరంగా దేశం ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 0.3 శాతం క్షీణించి 35.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. CADని నియంత్రించేందుకు ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని గతేడాది 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.

భారతదేశం ఏప్రిల్-జనవరి, 2023లో దాదాపు 600 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుందని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) మాజీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కొల్లిన్ షా అన్నారు. అధిక దిగుమతి సుంకం కారణంగా ఇది తగ్గింది. ప్రభుత్వం తప్పక దేశీయ పరిశ్రమకు సహాయం చేయడం, ఎగుమతులను ప్రోత్సహించాలన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి