AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC New Jeevan Shanti: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం భరోసా

చాలా పథకాలు ఒకేసారి డబ్బు చేతికి వచ్చేలా ఉంటాయి కానీ నెలనెలా పెన్షన్‌లా వచ్చే పథకాలు ఎక్కువ ఉండవు. ఒకవేళ​ ఉన్నా ఆయా పథకాలు ఇచ్చే కంపెనీలపై నమ్మకం లేక చాలా మంది ముందుకెళ్లరు. ఎందుకంటే ప్రభుత్వ భరోసాతో వచ్చే పథకాల గురించి ఎక్కువ మంది వెతుకుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి శుభవార్త చెబుతూ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

LIC New Jeevan Shanti: ఎల్ఐసీ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి పెట్టుబడితో జీవితాంతం భరోసా
Insurance
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 10, 2023 | 10:33 AM

Share

LIC Policy: సాధారణంగా మనలో చాలా మంది రిటైరయ్యాక జీవితం ఎలా ఉంటుందో? అనే బాధ పడుతూ ఉంటారు. ఎందుకంటే లేవలేని స్థితిలో సంపాదన మందగించినప్పుడు ఒకరికి భారం అవ్వకూడదని కోరుకుంటూ ఉంటారు. అందుకే చాలా మంది ముందు నుంచి పొదుపు మంత్రం జపిస్తూ ఉంటారు. లేవలేని స్థితిలో ఆర్థిక భరోసాపై నమ్మకం ఉంటుందని చాలా మంది ఈ పంథానే ఎంచుకుంటారు. అయితే చాలా పథకాలు ఒకేసారి డబ్బు చేతికి వచ్చేలా ఉంటాయి కానీ నెలనెలా పెన్షన్‌లా వచ్చే పథకాలు ఎక్కువ ఉండవు. ఒకవేళ​ ఉన్నా ఆయా పథకాలు ఇచ్చే కంపెనీలపై నమ్మకం లేక చాలా మంది ముందుకెళ్లరు. ఎందుకంటే ప్రభుత్వ భరోసాతో వచ్చే పథకాల గురించి ఎక్కువ మంది వెతుకుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారికి శుభవార్త చెబుతూ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జీవన్‌ శాంతి పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో ఓ సారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా నిర్ధిష్ట మొత్తంలో రాబడి వస్తుంది. ఈ జీవన్‌ శాంతి పథకం ప్రత్యేకతలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం.

ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి పథకం అనేది ఒక యాన్యుటీ ప్లాన్. అంటే దీన్ని తీసుకునేటప్పుడు, మీ పెన్షన్ మొత్తం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతినెలా పింఛను సౌకర్యం లభిస్తుంది. ఈ ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి పథకంలో రెండు రకాల ఎంపికలను అందుబాటులో ఉంటాయి. మొదటి ఎంపిక సింగిల్ లైఫ్ కోసం వాయిదా వేసిన యాన్యుటీ. మరొకటి ఉమ్మడి జీవితానికి వాయిదా వేసిన యాన్యుటీ. మొదటి ఎంపికలో మీరు ఒక వ్యక్తికి పెన్షన్ పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే పాలసీదారుడు మరణించినప్పుడు యాన్యుటీలో నామినీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. అలాగే పాలసీదారు జీవించి ఉంటే డిపాజిట్‌ చేసిన కొన్ని రోజుల తర్వాత అతను ప్రతి నెలా పెన్షన్‌ పొందుతాడు. జాయింట్ లైఫ్ కోసం వాయిదా వేసిన యాన్యుటీలో ఒకరు మరణిస్తే, మరొకరికి పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన తర్వాత పాలసీలో మిగిలిపోయే డబ్బు నామినీకి ఇస్తారు.ఈ పథకం ప్రకారం చెల్లింపు విధానం అర్ధ-వార్షిక, త్రైమాసిక, నెలవారీగా ఉంటుంది. యాన్యుటీ చెల్లింపు విధానం వార్షికమా? అర్ధ-వార్షికమా? త్రైమాసికమా? లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది. యాన్యుటీని వెస్టింగ్ తేదీ నుంచి 1 సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు, 1 నెల తర్వాత బకాయిల ద్వారా యాన్యూటినీ చెల్లిస్తారు. పాలసీ ప్రారంభంలో యాన్యుటీ రేట్లు హామీ ఇస్తారు. ఆ మేరకు నిర్ధిష్ట వ్యవధి అనంతరం యాన్యుటీ చెల్లిస్తారు. 

ఇవి కూడా చదవండి

పాలసీ తీసుకునే సమయంలో గమనించాల్సిన విషయాలు..

  • కొత్త జీవన్ శాంతి పథకం కనీస ప్లాన్ ధర రూ. 1.5 లక్షలుగా ఉంటుంది.
  • అయితే ఈ పథకంలో గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.
  • మీరు మీ అవసరాన్ని బట్టి వార్షిక, 6 నెలలు, 3 నెలలు లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు.
  • 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు ప్రతి నెలా రూ.1000 జీవితకాల పెన్షన్ లభిస్తుంది.
  • వార్షిక ప్రాతిపదికన కింద లెక్కిస్తే రూ.12,000 పెన్షన్ జీవితాంతం అందుబాటులో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం