Smartwatch: అలెక్సా సపోర్ట్‌తో ఫాస్ట్రాక్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్.. అద్భుతమైన ఫీచర్స్, ధరెంతో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ ఫాస్ట్రాక్  ఓ కొత్త స్మార్ట్ వాచ్‌ను తయారు చేసింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో పని చేసేలా ఫాస్ట్రాక్ లిమిట్ లెస్ ఎఫ్ఎస్1ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రూ.1995 ధరలో అమెజాన్‌లో ఈ వాచ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

Smartwatch: అలెక్సా సపోర్ట్‌తో ఫాస్ట్రాక్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్.. అద్భుతమైన ఫీచర్స్, ధరెంతో తెలుసా?
Fastrack 1
Follow us
Srinu

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 10, 2023 | 10:35 AM

Fastrack Limitless FS1: భారతదేశంలో యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. గత కొద్దిరోజులుగా స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ యాక్ససరీస్‌ను కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఈ స్మార్ట్ యాక్ససరీస్‌లో ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లంటే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. యువతలో వస్తున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొత్త కొత్త స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇదే కోవలో ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ ఫాస్ట్రాక్  ఓ కొత్త స్మార్ట్ వాచ్‌ను తయారు చేసింది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో పని చేసేలా ఫాస్ట్రాక్ లిమిట్ లెస్ ఎఫ్ఎస్1ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రూ.1995 ధరలో అమెజాన్‌లో ఈ వాచ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ద్వారా నేరుగా బ్లూటూత్ సపోర్ట్‌తో కాల్ చేయడానికి వీటుగా ఉంటుంది. ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ ఎఫ్ఎస్1 బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అలాగే ఏప్రిల్ 11 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. 1.95-అంగుళాల డిస్‌ప్లేతో అధునాతన ఏటీఎస్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు మద్దతు ఇస్తుంది. 

ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ ఎఫ్ఎస్1 స్పెసిఫికేషన్లు

  • ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ ఎఫ్ఎస్1 300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.
  • ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ ఎఫ్ఎస్1 బ్లాక్, బ్లూ, పింక్ కలర్ అందుబాటులో ఉంటుంది.
  • ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ ఎఫ్ఎస్1లో 1.95-అంగుళాల డిస్‌ప్లేతో అధునాతన ఏటీఎస్ చిప్‌సెట్‌తో వస్తుంది.
  • ఈ స్మార్ట్ వాచ్‌లో 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు ఉంటాయి. అలాగే ఇన్‌బిల్ట్ అమెజాన్ అలెక్సా సపోర్ట్‌తో వస్తుంది.
  • ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ ఎఫ్ఎస్1 దీర్ఘచతురస్రాకార డయల్‌ను కలిగి ఉంటుంది.
  • స్మార్ట్ వాచ్ స్క్రీన్ 240×296 రిజల్యూషన్‌తో 500నిట్స్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది.
  • నావిగేషన్ కోసం సైడ్-మౌంటెడ్ బటన్‌‌తో ఉంటుంది.
  • వినియోగదారులు వారి వాచ్ నుండి నేరుగా కాల్‌లను స్వీకరించడానికి మరియు చేయడానికి అనుమతించే బ్లూటూత్ కాలింగ్‌కు ఇది మద్దతు ఇస్తుంది.
  • స్మార్ట్‌వాచ్‌లో హృదయ స్పందన పర్యవేక్షణకు మద్దతుగా సెన్సార్లు అమర్చి ఉంటాయి. ఇది ఒత్తిడి, పీరియడ్స్, నిద్రను ట్రాక్ చేయడానికి సాయం చేస్తుంది.
  • వాకింగ్, రన్నింగ్ స్ప్రింటింగ్‌తో సహా 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. 
  • ఇందులో ఉన్న అమెజాన్ అలెక్సా ద్వారా వినియోగదారులకు హ్యాండ్స్-ఫ్రీ
  • వాయిస్ అసిస్టెంట్ ఎంపికను అందిస్తోంది.
  • ఆండ్రాయిడ్, ఐఓఎస్ సపోర్ట్‌తో స్మార్ట్‌ఫోన్‌లో ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ వరల్డ్ యాప్ సపోర్ట్ చేస్తుంది. 
  • ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ ఎఫ్ఎస్1 బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఇన్‌బిల్ట్ స్పీకర్లు, మైక్రోఫోన్‌‌తో వస్తుంది. 

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం