Google Pay: గూగుల్ పే యూజర్లకు రూ. 88 వేల వరకు క్యాష్‌బ్యాక్.. అసలేం జరిగిందంటే..
తమ యాప్‌లకు వినియోగదారులు పెరగాలనే ఉద్దేశంతో ఈ వ్యాలెట్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయనే విషయం తెలిసిందే. పేమెంట్ చేసిన సమయంలో క్యాష్‌బ్యాక్ పేరుతో ఆఫర్స్ అందిస్తుంటాయి. అయితే సహజంగా ఈ క్యాష్‌బ్యాక్ అమౌంట్ మహా అయితే ఓ రూ. 20 ఉంటుంది. అయితే ఏకంగా...
తమ యాప్‌లకు వినియోగదారులు పెరగాలనే ఉద్దేశంతో ఈ వ్యాలెట్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయనే విషయం తెలిసిందే. పేమెంట్ చేసిన సమయంలో క్యాష్‌బ్యాక్ పేరుతో ఆఫర్స్ అందిస్తుంటాయి. అయితే సహజంగా ఈ క్యాష్‌బ్యాక్ అమౌంట్ మహా అయితే ఓ రూ. 20 ఉంటుంది. అయితే ఏకంగా రూ. 88,000 క్యాష్ వస్తే ఎలా ఉంటుంది.? గూగుల్ పే యూజర్లకు ఇలాంటి బంపరాఫర్ తగిలింది. అంత మొత్తం క్యాష్ బ్యాక్ రావడం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ! అసలు ఏం జరిగిందో తెలియాంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
గూగుల్ కంపెనీకి చెందిన గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న కొంత మంది యూజర్ల జీపే ఖాతాల్లో అనూహ్యంగా రూ. 88,000 జమకావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్కో వినియోగదారుడికి 100 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. అయితే ఈ మొత్తం పొరపాటు పడినట్లు గుర్తించిన కంపెనీ వెంటనే వెనక్కి తీసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. గూగుల్ పే లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాగ్ ఫుడింగ్ అనే ఫీచర్‌ను పరీక్షిస్తున్న సమయంలో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. తమ ఉద్యోగులకు చెల్లించే బదులు అనుకోకుండా నగదును కొంతమంది యూజర్లకు పంపించినట్టు సమాచారం.
Uhhh, Google Pay seems to just be randomly giving users free money right now.
I just opened Google Pay and saw that I have $46 in “rewards” that I got “for dogfooding the Google Pay Remittance experience.”
What. pic.twitter.com/Epe08Tpsk2
— Mishaal Rahman (@MishaalRahman) April 5, 2023
ఈ విషమై మిషాల్ రెహమాన్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు క్యాష్ బ్యాక్ ద్వారా 13.25 డాలర్లు వచ్చినట్లు స్క్రీన్ షాట్‌ను షేర్ చేశారు. డాగ్ ఫుడింగ్ పేరున ఈ డబ్బులు జమ అయినట్లు పేర్కన్నారు. అయితే ఇది కేవలం పిక్సెల్ మొబైల్స్‌కి మాత్రమే పరిమితమైందా.? ఇతర యూజర్లకు కూడా క్యాష్ బ్యాక్ వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి..